తెలుగులో తన రేంజి ఏమిటో మరోసారి నిరూపించేసుకున్న కార్తీ

Update: 2022-10-29 07:55 GMT

తమిళ హీరో కార్తీకి తెలుగులో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కార్తీ సినిమాలో కంటెంట్ ఉందంటే తెలుగు ప్రజలు హిట్ స్టేటస్ తప్పకుండా ఇస్తారు. ఎన్నో సినిమాల విషయంలో ఇది జరిగింది. యుగానికి ఒక్కడు తమిళంలో ఫ్లాప్ అయినా ఇక్కడ మంచి హిట్ గా నిలిచింది. ఆవారా, నా పేరు శివ సినిమాలు తమిళం కంటే తెలుగులోనే మంచి హిట్స్ గా నిలిచి కార్తీ మార్కెట్ ను బాగా పెంచేశాయి. ఖైదీ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా దీపావళికి 'సర్దార్' తో తెలుగు వారిని పలకరించాడు కార్తీ. స్పై థ్రిల్లర్ గా సినిమా వచ్చింది. కార్తీ డబుల్ రోల్ లో సినిమాను నడిపించాడు. సినిమాకు తెలుగులో మంచి కలెక్షన్స్ వచ్చాయి.

'అభిమన్యుడు' లాంటి సూపర్ సైబర్ థ్రిల్లర్‌ను అందించిన పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన 'అన్నపూర్ణ స్టూడియోస్' ద్వారా విడుదల చేశారు. 'సర్దార్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.6.02 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది.
'సర్దార్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం 2.60 cr
సీడెడ్ 0.75 cr
ఉత్తరాంధ్ర 0.94 cr
ఈస్ట్+వెస్ట్ 0.58 cr
కృష్ణా + గుంటూరు 0.79 cr
నెల్లూరు 0.36 cr
ఏపి+ తెలంగాణ 6.02 cr
ఇక రెండో వారంలో సినిమా హాల్స్ సంఖ్యను పెంచుతోంది చిత్ర బృందం. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతోందని ప్రకటించారు.


Tags:    

Similar News