రేవంత్ రెడ్డి గురించి కేబీసీలో ప్రశ్న.. ఆ అమ్మాయి సమాధానం చెప్పిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వడానికి;

Update: 2023-12-29 11:42 GMT
RevanthReddy, CMRevanthReddy, KBC, Questions, TelanganaCM, RevanthReddy, CMRevanthReddy, KBC, Questions, TelanganaCM, KBC contestant on Revanth Reddy Bollywood actor Amitabh Bachchan,  KBC contestant on Revanth Reddy Bolly Bollywood actor Amitabh Bachchan,  KBC contestant on Revanth Reddy Bolly

KBC contestant on Revanth Reddy

  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వడానికి కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) పోటీదారుడు లైఫ్‌లైన్‌ను ఉపయోగించాడు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు పార్టిసిపెంట్ సమాధానం చెప్పలేకపోయారు.

ఈ నెల 15వ తేదీన ప్రసారమైన KBC ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్‌ను అమితాబ్ బచ్చన్ ప్రశ్నించారు. ఆప్షన్లుగా... ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధప్రదేశ్ ఇచ్చారు. పార్టిసిపెంట్‌గా ఉన్న యువతి లైఫ్ లైన్ తీసుకున్నది. ఈ సమయంలో ప్రేక్షకులలో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు. దీంతో సదరు యువతి తెలంగాణ అని సమాధానం చెప్పడంతో తదిపరి ప్రశ్నకు అర్హత సాధించారు.
ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో, తెలంగాణలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరిచింది. పార్టీ విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత పలు చర్చల అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.



Tags:    

Similar News