Breaking : ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటులపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు;

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటులపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీనటులు ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ ను...
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువతను పక్కదోవ పట్టిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ఇప్పటికే పదకొండు మంది యాంకర్లు, టీవీ నటులపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.