కెజిఎఫ్ హీరో అభిమాని సూసైడ్..!

కన్నడ నుండి కెజిఎఫ్ అనే మాస్ ఎంటెర్టైనర్ తో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారమెత్తిన యశ్ తదుపరి చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 2 ఎప్పుడొస్తుందా అని అయన [more]

;

Update: 2019-01-10 07:39 GMT
yash fan commits suicide
  • whatsapp icon

కన్నడ నుండి కెజిఎఫ్ అనే మాస్ ఎంటెర్టైనర్ తో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారమెత్తిన యశ్ తదుపరి చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 2 ఎప్పుడొస్తుందా అని అయన అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక యశ్ కి కన్నడనాట మంచి అభిమానులున్నారు. యశ్ తన ప్రతి పుట్టిన రోజుని అభిమానుల ఆనందోత్సాహాల మధ్యనే చేసుకునేవాడు. అయితే రవి అనే యశ్ వీరాభిమాని ఒకరు ప్రతి సంవత్సరం జనవరి 8న యశ్ పుట్టిన రోజుకి యశ్ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాడు. అయితే ఈ ఏడాది జనవరి 8న కర్ణాటకలోని పావగడ ప్రాంతానికి చెందిన రవి ఎప్పటిలాగే యశ్ ఇంటికి వచ్చి ఆయనను కలిసి బర్త్ డే విషెస్ చెప్పాలని ఆరాటపడ్డాడు.

నిప్పంటించుకుని…

అయితే గత ఏడాది సుమలత భార్య, సీనియర్ కన్నడ నటుడు అంబరీష్ మరణం వలన ఈ ఏడాది యశ్ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడట. అది తెలిసిన యశ్ అభిమాని రవి మాత్రం ఎప్పటిలాగే యశ్ ఇంటికి రాగా… యశ్ అతన్ని కలవడానికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై యశ్ ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసాడట. అయితే అక్కడే ఉన్నకొందరు రవిని దగ్గరలో ఉన్న విక్టోరియా హాస్పిటల్ కి తరలించగా… చికిత్స పొందుతూ రవి ఇవాళ ఉదయం మరణించాడు.

Tags:    

Similar News