నేను ఎవరినీ భారీగా పారితోషికం అడగలేదు: కేజీఎఫ్ హీరోయిన్

కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన మీద వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. తాను భారీగా రెమ్యునరేషన్ ను పెంచేశాననే

Update: 2022-09-30 12:33 GMT

కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన మీద వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. తాను భారీగా రెమ్యునరేషన్ ను పెంచేశాననే రూమర్స్ ను ఖండిస్తున్నానని తెలిపింది. తాను భారీ పారితోషికం పెంచేశాననే రూమర్లు ఏ మాత్రం నిజం కాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ సినిమాకు కూడా ఇంకా ఓకె చేయలేదని.. పలు కథలను పరిశీలిస్తున్నానని చెప్పుకొచ్చింది. నా గురించి మీరు చదివే రూమర్లు చాలా వరకూ అబద్ధాలేనని తెలిపింది. తాను చాలా అరుదుగా ఇంటర్వ్యూలను ఇస్తూ ఉంటానని.. అవేవీ నిజం కాదని తెలిపింది. ఇక టాలీవుడ్ దర్శకుడు.. రాజమౌళి సినిమాలో పని చేయాలని తాను కూడా కోరుకుంటూ ఉన్నానని.. అది వీలైనంత త్వరగా జరగాలని కోరుకుంటూ ఉన్నానని తన లైఫ్ సెషన్ లో తెలిపింది. ఈ ఏడాది తాను నటించిన రెండు సినిమాలు కేజీఎఫ్-2, కోబ్రా విడుదలయ్యాయని.. తన మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు అని తెలిపింది. ఇక కేజీఎఫ్-3 గురించి తనకేమీ తెలియదని.. చిత్ర దర్శకులు, నిర్మాతలను అడగాలని తెలిపింది. ప్రస్తుతమైతే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని.. అయినా ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని తెలిపింది శ్రీనిధి.


Tags:    

Similar News