దసరా కి కన్ఫర్మ్ చేస్తారేమో?

కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కి ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై భారీ రికార్డులు సృష్టించిన కెజిఎఫ్ చాప్టర్ [more]

Update: 2020-10-09 05:14 GMT

కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కి ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై భారీ రికార్డులు సృష్టించిన కెజిఎఫ్ చాప్టర్ సినిమాకి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 పై పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ ఉంది. కరోనా కారణముగా ఆగిన షూట్ మెల్లిగా అందరికన్నా ముందే ప్రశాంత్ నీల్ సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. యష్ ని ఇంకాస్త ఎనేర్జిగా మాస్ గా కెజిఎఫ్ 2 లో ప్రశాంత్ నీల్ చూపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అధీరగా మాస్ అండ్ రా విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడడంతో.. ప్రస్తుతం అయన లేని సన్నివేశాల చిత్రీకణ జరుగుతుంది. సంజయ్ దత్ హాస్పిటల్ అంటూ తిరగడంతో.. ప్రశాంత్ నీల్ కూడా సంజయ్ దత్ మీద ఒత్తిడి తీసుకురాకుండా మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట.

ఇకపోతే అన్ని అనుకూలకగా ఉంటే రాఖి భాయ్ అదేనండి యాష్ కెజిఎఫ్ 2 ఈపాటికి థియేటర్స్ లో ల్యాండ్ అయ్యేదే. కానీ కరోనా తో ప్లాన్స్ అన్ని ప్లాప్ అయ్యాయి. ఇకపోతే వచ్చే దసరాకి కెజిఎఫ్ టీజర్ విడుదల చేసి.. దాని ద్వారా సినిమా విడుదల డేట్ ప్రకటించవచ్చని.. ఆ డేట్ కూడా సంక్రాంతికి ఉండినా ఉండొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. అయితే ఇప్పుడు విడుదల వాయిదా పడిన సినిమాలన్ని థియేటర్స్ ఓపెన్ చేసిన ప్రేక్షకుల మీద అనుమానంతో.. సంక్రాంతికి షిఫ్ట్ అవుతున్నారు. ఈసారి సంక్రాంతికి రాఖి భాయ్ కూడా అంటే ఆ జోరు మాములుగా ఉండదు. మరి కెజిఎఫ్ కూడా సంక్రాంతికే విడుదల అంటే.. ఇక ఆ పండగలకి ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయి.

Tags:    

Similar News