క్రాక్ కలెక్షన్స్ జోరు!

జనవరి తొమ్మిది న ఎంతో గ్రాండ్ గా, క్రేజీగా విడుదల కావాల్సిన క్రాక్ సినిమా రిలీజ్ డిలే అవడం, ఎన్నో ప్రోబ్లెంస్ ని ఫేస్ చేసుకుని ఎట్టకేలకు [more]

Update: 2021-01-12 10:31 GMT

జనవరి తొమ్మిది న ఎంతో గ్రాండ్ గా, క్రేజీగా విడుదల కావాల్సిన క్రాక్ సినిమా రిలీజ్ డిలే అవడం, ఎన్నో ప్రోబ్లెంస్ ని ఫేస్ చేసుకుని ఎట్టకేలకు ఈవెనింగ్ కి థియేటర్స్ లో బొమ్మ పడడం.. మాస్ మహారాజ్ క్రేజ్, సినిమా మీద ప్రేక్షకులకున్న మోజు రెండు కలిసొచ్చి క్రాక్ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం, ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ప్రకారం  సోషల్ మీడియాలో క్రాక్ సినిమాకి మంచి బుజ్ తెచ్చుకోవడం సినిమాకి బాగా కలిసొచ్చింది. ఫస్ట్ డే, సెకండ్ డే, అలాగే విడుదలైన రోజు నైట్ షోస్ తో కలిపి మంచి వసూళ్లనే రాబట్టింది రవితేజ క్రాక్. జనవరి తొమ్మిది నైట్ షోస్ నిన్న, ఈరోజు వసూళ్లు కలిపి 8 కోట్ల 80 లక్షలు కలెక్షన్స్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి మొదటి రోజు నైట్ షోస్, ఆదివారం కలెక్షన్స్ ఆరు కోట్లు ఉండగా.. సోమవారం మూడు కోట్లు లాగేసినట్టుగా చెబుతున్నారు.
అయితే ఇప్పటికే 9 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన మాస్ మహారాజ్ క్రాక్ ఇంకా తొమ్మిది కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది. ఆల్రెడీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని బిజినెస్ లు అనుకున్న రేంజ్ లోనే జరగగా.. ఒక్క థియేట్రికల్ హక్కులు మాత్రం 18 కోట్లకి అమ్ముడుపోయాయి. అంటే ఇప్పటికి తొమ్మిది కోట్లు రాబట్టిన రవితేజ మిగతా తొమ్మిది తెచ్చుకోగలడా.. ఎందుకంటే మంగళవారం తప్పితే బుధవారం నుండు సంక్రాంతి పుంజులు బరిలోకి దిగుతున్నాయి. తమిళనాడు నుండి భారీ క్రేజ్ తో మాస్టర్ బుధవారం థియేటర్స్ లోకి రాబోతుంటే.. గురువారం పెద్ద పండగ రోజున రామ్ రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు థియేటర్స్ లోకి దిగుతున్నాయి. మరి ఈ మూడు సినిమాలను తట్టుకుని రవితేజ మరో తొమ్మిది కోట్లు లాగేసి బ్రేక్ ఈవెన్ కొడతాడా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తికరమైన ప్రశ్న.

Tags:    

Similar News