వర్మ… ఏమిటీ గందరగోళం..?

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తీసే సినిమాల విషయంలో.. ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూనే వస్తున్నాడు. ట్రైలర్ తో, సాంగ్స్ తో హైప్ లేపుతూ.. [more]

Update: 2019-02-28 06:36 GMT

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తీసే సినిమాల విషయంలో.. ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూనే వస్తున్నాడు. ట్రైలర్ తో, సాంగ్స్ తో హైప్ లేపుతూ.. సినిమాలో మాత్రం విషయం లేకుండా చెయ్యడం వర్మకి పరిపాటిగా మారింది. తాజాగా లక్షీస్ ఎన్టీఆర్ విషయంలో తెగ హడావిడి చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా విడుదల మార్చ్ 15 అంటూ లీకులు వదులుతున్నాడు. ఇంకా అధికారిక ప్రకటన రాని లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అసలే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలతో ప్రేక్షకులు చికాకులో ఉన్నారు. ఇప్పుడు భారీ క్రేజ్ ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తే గనక వర్మకి లాభాలే లాభాలు.

రీషూట్లు జరుగుతున్నాయా..?

అయితే తాజాగా వర్మ వాలకం చూస్తుంటే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఏదో జరుగుతుందనిపిస్తుంది. ఎంతో హైప్ క్రియేట్ అయ్యి ఉన్న ఈ సినిమా ఎన్నికల సీజన్ కావడంతో.. ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు పొలిటికల్ సర్కిల్స్‌ లో సెగ పుట్టిస్తోంది. అయితే నిన్నమొన్నటివరకు ప్రమోషన్స్ విషయంలో చాలా యాక్టీవ్ గా ఉన్న వర్మ తాజాగా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు. కారణం సినిమాకి రీషూట్స్ జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. సినిమా ప్రొడక్షన్ దాదాపు పూర్తయి, రీ రికార్డింగ్ వర్క్స్ మొదలైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ… లక్ష్మీస్ ఎన్టీయార్ మీద వర్మకు సెకండ్ థాట్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

నాసిరకం సీన్లు తొలగింపు

అయితే షూటింగ్ పూర్తయ్యింది అని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అవుట్ పుట్ విషయంలో వర్మ కాస్త గందరగోళానికి గురవుతున్నాడని… ఆన్ సెట్స్ డైరెక్టర్ అగస్త్య మంజు పనితీరు మీద వర్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని… అందుకే సినిమా క్వాలిటీ విషయంలో రాజి పడకుండా నాసిరకం సన్నివేశాలను తొలగించి… ఆ సీన్స్ ని మళ్లీ రీషూట్ చేస్తే బాగుంటుందని దాని మీద చర్చలు మొదలైనట్టుగా ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News