మ‌హానాయ‌కుడు విష‌యంలో త‌ప్పు చేస్తున్నారా..?

ఫిబ్రవరి 7న విడుదలవ్వాల్సిన ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22కి మరింది. కథానాయకుడు దెబ్బకి మహానాయకుడు సినిమాని రీషూట్స్ మీద రీషూట్స్ చేసి రిపేర్ల మీద రిపేర్లు చేసి [more]

Update: 2019-02-13 04:34 GMT

ఫిబ్రవరి 7న విడుదలవ్వాల్సిన ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22కి మరింది. కథానాయకుడు దెబ్బకి మహానాయకుడు సినిమాని రీషూట్స్ మీద రీషూట్స్ చేసి రిపేర్ల మీద రిపేర్లు చేసి షూటింగ్ పూర్తి చేశారు క్రిష్. కథానాకుడు విడులయ్యాక రెండు రోజుల వరకు ఎన్టీఆర్ మహానాయకుడు మీదున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కథానాయకుడు సూపర్ హిట్, మహానాయకుడు బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. కానీ కథానాయకుడు దెబ్బకు కథ మొత్తం మొదటికి వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కింది మొదలు దర్శకుడు క్రిష్ కథానాయకుడు, మహానాయకుడు ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో మొదలుపెట్టాడు.

ప్ర‌మోష‌న్స్ లేక‌పోతే ఎలా..?

అప్పుడు కథానాయకుడు ప్రమోషన్స్ కి ఆహా ఓహో అన్నారంతా. ఇప్పుడు మహానాయకుడు ఎప్పుడొస్తుందో క్లారిటీ వచ్చింది కానీ.. ప్రమోషన్స్ లేవు. ఫిబ్రవరి 22న‌ మహానాయకుడు రాక ఖరారైనట్లుగా సమాచారం ఉంది. మరి ఏదో ఒక పోస్టర్ మీద మహానాయకుడు రాకను అధికారికంగా డేట్ ఇచ్చేసినా ఇచ్చెయ్యొచ్చు. అసలు కథానాయకుడుకి ఉన్న ప్రమోషన్స్, క్రేజ్ మహానాయకుడుకి మచ్చుకైనా కనబడడం లేదు. ఒక పక్క విడుదల తేదీకి పట్టుమని పది రోజులు కూడా లేదు. మరోపక్క ప్రమోషన్స్ మొదలవ్వలేదు. మరి క్రిష్, బాలకృష్ణ మహానాయకుడు ప్రమోషన్స్ ని ఈ పది రోజుల్లో ఎలా మొదలు పెట్టి.. ఆకట్టుకుంటారో అర్ధం కావ‌టం లేదు.

10 రోజుల్లో సాధ్య‌మేనా..?

ఎంతగా ప్రెస్ మీట్, ఆడియో రిలీజ్ ఈవెంట్, ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చినా అసలే క్రేజ్ లేని సినిమాకి ఇంత తక్కువ సమయంలో హైప్ తీసుకురావడం కష్టం. ఇక కథానాయకుడు అప్పుడు ఆ సినిమాలో చిన్న పాత్రలకు పరిమితమైన నటులు కూడా కథానాయకుడుని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడి పబ్లిసిటీ చేసేసారు. కానీ మహానాయకుడులో కీలకపాత్రలు చేసిన వ్యక్తులు కూడా మహానాయకుడుపై చిన్న మాట కూడా వదలడం లేదు. అసలే వాయిదాల మీద వాయిదాల పడి సినిమాకి ఉన్న క్రేజ్, హైప్ మరింత తగ్గడం ఖాయంగా కనబడుతుంది. అందుకే ఈ పడి రోజుల్లోనే మహానాయకుడు టీంని అందరూ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టండి అంటున్నారు.

Tags:    

Similar News