మహానాయకుడు పరిస్థితి ఇంత దారుణమా..?

ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా నిన్న రిలీజ్ అయింది. కథానాయకుడుతో పోలిస్తే ఈ సినిమా మరో డిజాస్టర్ గా మిలిగిపోయింది. కలెక్షన్స్ కూడా [more]

Update: 2019-02-23 08:10 GMT

ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా నిన్న రిలీజ్ అయింది. కథానాయకుడుతో పోలిస్తే ఈ సినిమా మరో డిజాస్టర్ గా మిలిగిపోయింది. కలెక్షన్స్ కూడా చాలా డల్ గా వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సంక్రాంతి సీజన్ లో మంచి హైప్ తో రిలీజ్ అయిన కథానాయకుడు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో జనాధరణకు నోచుకోలేదు. ఇక అన్ సీజన్లో.. ఎంతో నెగెటివిటీ మధ్య రిలీజై.. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ‘మహానాయకుడు’ పరిస్థితి చెప్పేదేముంది? కథానాయకుడు మొదటి రోజు మంచి వసూళు రాబట్టింది. మెజారిటీ స్క్రీన్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి.

కథానాయకుడులో సగం వసూళ్లే..

కానీ మహానాయకుడు ఫస్ట్ డే.. మేజర్ సిటీస్‌లోని ప్రధాన థియేటర్లలో కూడా హౌస్ ఫుల్స్ లేవు. కారణం సినిమాలో అసలు కంటెంట్ లేకపోవడం, ప్రమోషన్స్ కూడా అసలు లేకపోవడం. హైదరాబాద్ లో ఈ సినిమాకు ఒకట్రెండు మల్టీప్లెక్సుల్ని మినహాయిస్తే అన్ని చోట్లా ఆక్యుపెన్సీ సరిగా లేదు. ఉదయం షోస్ తరువాత పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో కథానాయకుడు తొలి రోజు మూడు థియేటర్స్ లో రిలీజ్ చేస్తే… మహానాయకుడు ఒక స్క్రీన్లోనే వేశారు. కథానాయకుడుతో పోలిస్తే తొలి రోజు షేర్ సగం రావడం విడ్డురం. కాబట్టి కథానాయకుడు కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా ఏమైనా ఊరట ఇస్తుంది అనుకుంటే కష్టంలా కనిపిస్తుంది.

Tags:    

Similar News