మహానాయకుడుపై ఆలోచన అదేనట..!
మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో టీం మొత్తం మహానాయకుడుపైనే హోప్స్ పెట్టుకుంది. హోప్స్ పెట్టుకుంటే ఏమి లాభం దానికి [more]
మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో టీం మొత్తం మహానాయకుడుపైనే హోప్స్ పెట్టుకుంది. హోప్స్ పెట్టుకుంటే ఏమి లాభం దానికి [more]
మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో టీం మొత్తం మహానాయకుడుపైనే హోప్స్ పెట్టుకుంది. హోప్స్ పెట్టుకుంటే ఏమి లాభం దానికి తగిన ప్రమోషన్స్ చేయాలి కదా. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. కథానాయకుడు అప్పుడు రోజుకొక స్టైల్, టీజర్స్, ఇంటర్వూస్ వంటివి విడుదల చేసి సినిమాపైన అంచనాలు పెంచేశారు. కానీ ఆ జోష్ మహానాయకుడు విషయంలో కనిపించడం లేదు. రెండు రోజుల్లో విడుదల ఉండగా.. ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు బాలయ్య. కనీసం ట్రైలర్ లాంచ్ కూడా చేయలేదు. ఈనెల 22న వస్తున్నాం అని ప్రకటించారు కానీ ఏ హడావిడి లేదు టీం నుండి. దాంతో బయ్యర్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు టాక్.
టాక్ బాగుంటేనే ప్రమోషన్స్
అవసరానికి మించి కథానాయకుడుకి పబ్లిసిటీ చేస్తేనే దానికి అంతంత మాత్రమే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు 'మహానాయకుడు' పబ్లిసిటీ లేకుండా థియేటర్లు ఎలా నిండుతాయన్నది బయ్‌ీర్ల ప్రశ్న. అయితే ఎన్టీఆర్ టీం మాత్రం వేరేలా ఆలోచిస్తుందట. మొదటి భాగం అంతగా ఆడలేదు కాబట్టి, ఇప్పుడు జనాలకు ఏం చెప్పినా ఓవర్‌గా ఉంటుందని, సినిమా చూశాకే… అందులో విషయం ఉంటే వాళ్లే ఆదరిస్తారని నమ్ముతున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే అప్పుడు ప్రమోషన్స్ చేద్దాం అని అనుకున్నారట. మరి ఇది ఎంతవరకు కరెక్టో వారే ఆలోచించాలి.