నిశబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు..!

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ నట జీవితాన్ని పూర్తిగా చూపించి… రాజకీయ జీవితంలోకి అడుగులెలా పడ్డాయో చూపించారు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ [more]

Update: 2019-02-16 14:08 GMT

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ నట జీవితాన్ని పూర్తిగా చూపించి… రాజకీయ జీవితంలోకి అడుగులెలా పడ్డాయో చూపించారు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కథానాయకుడులో ఎన్టీఆర్ నట జీవితం చూపించగా.. మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయజీవితాన్ని చూపించారు. అదే ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ గా తెలియజేసారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, ఆయన రాజకీయాల్లో ఎదగడం దగ్గర నుండి… అక్కడ పడిన ఒడిదుడుకులు అన్నింటినీ మహానాయకుడులో చూపించారు. ఇక మహానాయకుడు ట్రైలర్ లోకి వెళితే… ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రజలతో ఎలా మమేకమైంది, ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను మొదలుపెట్టింది, కాంగ్రెస్ అధ్యక్షరాలు ఇందిరా గాంధీతో విభేదాలు అన్నింటినీ హృద్యంగా చూపించారు. ఇక రాజకీయాలలో ఎన్టీఆర్ వెన్నంటి ఉండి అయనకి రాజకీయ పాఠాలు నేర్పిన వ్యక్తిగా నాదెళ్ల భాస్కర్ రావుని, ఎన్టీఆర్ కి సలహాలు సూచనలు చేసే చంద్రబాబు పాత్రని కూడా చూపించారు.

ఆకట్టుకుంటున్న డైలాగ్స్

ఇక భార్య బసవతారకంకి క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కి.. కుటుంబాన్ని చూసుకో.. నేను రాజకీయాలను చూసుకుంటానని చెప్పడం, అలాగే రాజకీయాల్లో పెద్దాయనకు గ్లామర్ ఉంటే.. నా దగ్గర గ్రామర్ ఉందని చంద్రబాబుకి నాదెళ్ల చెప్పడం.. ఇంకా దగ్గుబాటితో చంద్రబాబు… చెప్పేవాడు లేకపోతే ఆరు కోట్ల మందున్నా ఎన్టీఆర్ ఒంటరైపోతాడు అని చెప్పే డైలాగ్.. నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు.. మౌనం మరణాయుధంతో సమానం అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక చంద్రబాబు పాత్రని హైలెట్ చెయ్యకుండా.. సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నాదెళ్ల భాస్కర్ రావు క్యారెక్టర్ ని బాగా హైలెట్ చేసి ఈ మహానాయకుడు ట్రైలర్ లో చూపించారు. రానా చంద్రబాబుగా, ఎన్టీఆర్ గా బాలకృష్ణ, నాదెళ్ల భాస్కర్ రావు గా సచిన్ కెద్కర్ అద్భుతంగా నటించారు. ఇక కుటుంబాన్ని ఎక్కువగా హైలెట్ చెయ్యకుండా.. కేవలం రాజకీయాలతోనే ఈ సినిమాని నింపేసారనేది ఈ ట్రైలర్ స్పష్టం చేస్తుంది. వచ్చే శుక్రవారమే విడుదల కాబోతున్న మహానాయకుడు రన్ టైం కూడా చాలా తక్కువ కావడం సినిమాకి ప్లస్ కాబోతుంది. కేవలం 2.8 గంటలు మాత్రమే ఉన్న మహానాయకుడు రన్ టైం, సినిమాకి సెన్సార్ వారు క్లిన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం ఇలా అన్నీ ఈ సినిమాకి పాజిటివ్ కనబడుతున్న అంశాలే.

 

Tags:    

Similar News