సుకుమార్ ను బ్లాక్ చేసి పెట్టేరు..!

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ఇంకా తన తదుపరి చిత్రం ఏంటో ఫైనల్ చేయలేదు. కారణం స్టోరీ రెడీ చేయడం లేట్ అవుతుంది. మొన్నటివరకు [more]

Update: 2019-04-19 11:30 GMT

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ఇంకా తన తదుపరి చిత్రం ఏంటో ఫైనల్ చేయలేదు. కారణం స్టోరీ రెడీ చేయడం లేట్ అవుతుంది. మొన్నటివరకు మహేష్ తో సినిమా చేద్దాం అని డే అండ్ నైట్ కష్ట‌ప‌డి స్టోరీ డెవెలప్ చేస్తున్న టైంలో మహేష్.. సుకుమార్ ని కాదని అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ మహేష్.. అనిల్ తో సినిమా చేయడానికి కారణం ఒకటి ఉంది. బన్నీతో తనకు తెలియకుండా సుకుమార్ సినిమా ఓకే చేయించుకోవడం.

మ‌హేష్ ను నారాజ్ చేసినా

దాంతో మహేష్ ఇంకా సుకుమార్ తో సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాడు. కానీ సుకుమార్ వెళ్లి మళ్లీ మహేష్‌ని ప్రసన్నం చేసుకున్నాడు. ఇటు బన్నీ కూడా సుకుమార్ కథ రెడీ చేస్తున్నాడు కదా అని అతడికి సరిపడా సమయం ఇవ్వకుండా ‘ఐకాన్‌’ అనే మరో సినిమా అనౌన్స్‌ చేసాడు. వేణు శ్రీరామ్ వద్ద కథ రెడీగా ఉండడంతో బన్నీ త్రివిక్రమ్ తరువాత ఐకాన్ మూవీ చేయనున్నాడు.

ఇప్ప‌ట్లో సినిమా లేన‌ట్లే…

బాలీవుడ్‌, హాలీవుడ్‌లో కథ కోసమే ఎన్ని ఏళ్లయినా హీరోలు వేచి చూస్తుంటారు. కానీ టాలీవుడ్ లో పరిస్థితులు వేరు. కథ ఏమన్నా తేడా కొట్టినా డైరెక్టర్ నే బ్లేమ్ చేస్తారు. ఇక్కడ డైరెక్టర్స్ కోసం హీరోలు ఆగరు. హీరోల కోసమే డైరెక్టర్స్ ఆగాలి. సో సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టే. సుకుమార్ కూడా స్టోరీని చాలా స్లోగా రెడీ చేస్తుంటాడు. అందుకే తన సినిమాలు అంత లేట్ అవ్వడానికి కారణం.

Tags:    

Similar News