‘మహర్షి’ పరిస్థితి ఇలా ఉందేంటి..?

బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాప్ల తర్వాత కూడా ‘భరత్ అనే నేను’ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. కొరటాల – మహేష్ హిట్ కాంబో గనుక ఈ సినిమా [more]

;

Update: 2019-04-29 07:38 GMT
maharshi movie rayalaseema area collections
  • whatsapp icon

బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాప్ల తర్వాత కూడా ‘భరత్ అనే నేను’ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. కొరటాల – మహేష్ హిట్ కాంబో గనుక ఈ సినిమా మీద భారీ క్రేజ్ వచ్చింది. కానీ భరత్ అనే నేను హిట్ తర్వాత వస్తున్న మహర్షి సినిమా మీద మునుపటి క్రేజ్ కనబడడం లేదు. మే 9న అంటే మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న మహర్షి సినిమా మీద ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో అస్సలు ఆసక్తి కనిపించడం లేదు. ఒక్కో పాట మార్కెట్ లోకి విడుదలవుతున్నా.. ఆ పాటల మీద ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. మరి దేవిశ్రీ అందించిన మ్యూజిక్ అలా ఉంది. ఇక ఒకప్పుడు స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే చాలు జనాల్లో ఎంతో ఆసక్తి కనిపించేది. మరి మహర్షి విషయంలో అంతగా బజ్ రాకపోవడానికి కారణం ఏమిటో అంతుచిక్కడం లేదు.

శ్రీమంతుడులానే ఉండటంతో…

ఈ సినిమా పాటల్లో శ్రీమంతుడు స్టయిల్ కనబడుతుంది అని ఒకరు.. మహేష్ – పూజ హెగ్డే కాంబో శృతి హాసన్ – మహేష్ కాంబోలాగే ఉందని మరికొందరు అంటున్నారు. అలాగే శ్రీమంతుడులోని డాన్స్ లే మహర్షిలోనూ కనబడుతున్నాయనే టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మహర్షి టీజర్ చూసినా, పాటలు విన్నా శ్రీమంతుడు సినిమా గుర్తుకు రావడమే మహర్షికి మైనస్ గా మరిందని.. ప్రమోషన్స్ లో మంచి వేరియేషన్స్ చూపిస్తేనే సినిమా మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని అంటున్నారు. మరి వంశీ పైడిపల్లి ఇంతవరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఏ హీరోకి ఇవ్వలేదు. ఇప్పుడైనా మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడో లేదంటే యావరేజ్ ఇస్తాడో చూద్దాం.

Tags:    

Similar News