క్రేజీ డైరెక్టర్ తో మహేష్?

ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన మహర్షి సినిమా మే నెలకు వాయిదా పడింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరో [more]

Update: 2019-03-09 06:26 GMT

ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన మహర్షి సినిమా మే నెలకు వాయిదా పడింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరో పక్క మహేష్ తన 26 చిత్రం ని కూడా లైన్ లో పెట్టేసేసాడు. సుకుమార్ తో చేయాల్సిన ఈసినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. అనిల్ ఇంకా పూర్తి స్క్రిప్ట్ చెప్పకపోవడంతో ఇది ఫైనల్ అని చెప్పలేం. ఇది పక్కన పెడితే మహేష్ తన 27 వ సినిమాకు అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అది కూడా ఒక క్రేజీ డైరెక్టర్ కి. మన రాష్ట్రం డైరెక్టర్ కాదు పక్క రాష్ట్రం లో కెజిఎఫ్ తో దేశవ్యాప్త సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ప్రశాంత్ వచ్చి నమ్రత, మహేష్ లకు ఓ కథ చెప్పితే అది ఇద్దరికీ భలే నచ్చడంతో వచ్చే ఏడాది కెజిఎఫ్ 2 రిలీజ్ కాగానే ఇది స్టార్ట్ చేద్దామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

అసలు నిజానికి కెజిఎఫ్ 2 పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇంకా సరిగా కాస్టింగ్ పనులే పూర్తి అవ్వలేదు. స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. బడ్జెట్ కూడా పెరిగిపోవడంతో ఇదంతా టైం పాస్ గాలి వార్తగా మహేష్ క్యాంప్ కొట్టిపారేస్తోందట. సో మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News