మరిచిపోలేని జ్ఞాపకం.. డాన్స్ ఇండియా డాన్స్ లో పాల్గొనడంపై మహేష్ ట్వీట్
మహేష్ ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో డ్యాన్స్ వేసిన ఓ ఇద్దరికీ మహేష్..
టెలివిజన్ లో ప్రసారమయ్యే షో లకు సినిమా స్టార్లు గెస్టులుగా రావడం ట్రెండ్ గా మారింది. అందునా స్టార్ హీరోలు వస్తే.. ఆ షో టీఆర్పీ అమాంతం పెరిగిపోతుంది. కొన్ని షో లలో ఫైనల్స్ లో.. మరికొన్ని షో ల ప్రారంభోత్సవాలకు హీరోలు గెస్టులుగా వస్తున్నారు. తాజాగా ఓ టెలివిజన్ ఛానల్ లో ప్రారంభం కాబోతున్న డాన్స్ ఇండియా డాన్స్ ప్రోమో లో మహేష్, ఆయన కూతురు సితార గెస్టులుగా రావడం చూపించారు. ఈ ప్రోమో లో వారిద్దరికీ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడున్న డ్యాన్సర్లతో సితార స్పెప్పులేసింది.
మహేష్ ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో డ్యాన్స్ వేసిన ఓ ఇద్దరికీ మహేష్ తన తర్వాతి సినిమాలలో ఛాన్స్ ఇస్తా అన్నారు. ప్రోమో సూపర్ డూపర్ హిట్.. ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ వెయిటింగ్. ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. కాగా.. తాజాగా మహేష్ ఈ ప్రోగ్రాం ప్రోమోని షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశాడు.
సితారతో కలిసి మొదటి సారి టీవీ షోలో కనిపించడం చాలా బాగుంది. గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది. తప్పకుండా ఈ ఎపిసోడ్ చూడండి అని మహేష్ ట్వీట్ చేశారు. షో లో తనకి తన కూతురికి గ్రాండ్ వెల్కమ్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.