వర్మకి షాకిచ్చిన మీడియా..!

సెన్సార్ బోర్డు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపేసింది. దాంతో వర్మ కోర్టుకు ఎక్కుతానని ప్రకటించాడు. ఆయన కోర్టుకి వెళ్లినా.. వెళ్లకపోయినా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 11 తరువాత [more]

Update: 2019-03-18 08:04 GMT

సెన్సార్ బోర్డు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపేసింది. దాంతో వర్మ కోర్టుకు ఎక్కుతానని ప్రకటించాడు. ఆయన కోర్టుకి వెళ్లినా.. వెళ్లకపోయినా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 11 తరువాత రిలీజ్ అవుతుంది. ఈ లోపల ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల అవ్వదు. వర్మ ఇప్పుడు ఏమి చేయగలడు… కావాల్సినంత రచ్చ చేయగలడు. అది కూడా సోషల్ మీడియాలో. బయటకి వచ్చి టీవీలలో డిబేట్ పెడదాం అంటే టీవీ చానెల్స్ వాళ్లు ఖాళీగా లేరు. అంతా పొలిటికల్ హీట్ మీద ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా ఆగిపోయిందన్న డిస్కషన్స్ లేవు.

వర్మ ముందు ఆప్షన్ అదే

అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఏదైనా ఇలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్‌ను.. ఎన్నికల కోడ్ రాక ముందే రిలీజ్ చేయాలి. కానీ అలా చేయలేదు. మరి ఈ విషయంలో వర్మ నిర్లక్ష్యం చేసారో లేదో తెలియదు కానీ సినిమా అయితే ఆగిపోయింది. ఎన్నికల తరువాత రిలీజ్ చేసుకున్నా దీన్ని ఎవరు పటించుకోరు. ఇక ఉన్న ఒకే ఒక్క ఆప్షన్.. యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడం. కానీ అలా చేస్తే చాలా తక్కువ మంది మాత్రమే చూసే అవకాశం ఉంది. అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News