సైరా శాటిలైట్స్ విషయంలో ఫేక్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ [more]

Update: 2019-10-02 07:40 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల మేర సాగిందని ఒరిజినల్ లెక్కలు బయటికి వచ్చాయి. తాజాగా ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని కొనడానికి చాలా ఛానల్స్ వచ్చాయి కానీ రామ్ చరణ్ చెప్పిన రేట్ కి ఎవరూ డేర్ చేయలేదు ఒక్క జెమినీ ఛానల్ తప్ప.

సైరా సేఫేనా….

జెమినీ చానెల్ వాళ్లు సైరా శాటిలైట్ ని చేజిక్కించుకున్నారు. జెమినీ వాళ్ళు కాస్త డేర్ చేసి ఈ సినిమాను కొన్నారు. కేవలం శాటిలైట్ కోసం 25 కోట్లు జెమిని చెల్లిస్తోందట. తెలుగు, తమిళం, మలయాళం వరకూ హక్కుల్ని ఈ చానెల్ చేజిక్కించుకుంది. డిజిటల్ జెమినీ కాదట. డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్లకు 50 కోట్లకు అమ్మేశారు. మొదటి షో నుండే హిట్ టాక్ రావడంతో ఈసినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి పైగా యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి కాబట్టి జెమినీ వాళ్ళు ఇంత పెట్టి కొన్నట్టు తెలుస్తుంది.

 

Tags:    

Similar News