చిరంజీవి సీరియస్... ఆ ఘటన కలచివేసిందంటూ?
మెగాస్టార్ చిరంజీవి లండన్ పర్యటనలో జరిగిన ఘటనలపై సీరియస్ అయ్యారు;

మెగాస్టార్ చిరంజీవి లండన్ పర్యటనలో జరిగిన ఘటనలపై సీరియస్ అయ్యారు. చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించిన నేపథ్యంలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.ఈ క్రమంలో చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని తెలిసి చిరంజీవి ఆగ్రహం వ్యక్తంచేశారు. చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు.
ఫ్యాన్స్ పేరుతో...
యూకేలో తనను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకిందని, ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి అనుచిత ప్రవర్తను నేను అస్సలు ఒప్పుకోనని తెలిపారు. తాను దీనిని ఖండిస్తున్నానని చెప్పారు. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయాలని కూడా కోరారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు, ఎక్కడా కూడా తాను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించాలని చిరంజీవి తన ఫ్యాన్స్ ను కోరారు.