చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండే సంచలనాలకు నెలవుగా మారింది. ఈ సినిమా కి సంబందించిన ఏ విషయమైనా నిమిషాల్లో మీడియాకి పాకిపోతుంది. తాజాగా సై రాకు సంబందించిన భారీ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కేవలం 35 రోజుల్లోనే ముగించేసింది సై రా టీమ్. కోకాపేటలో వేసిన సై రా సెట్ లో ఆంగ్లేయులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి జరిగే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 40 కోట్ల కు పైగా ఖర్చు పెట్టారు.
ఆంగ్లేయులపై సైరా నరసింహారెడ్డి దండెత్తి వెళ్లి అక్కడ వాళ్ళ ఆయుధాగారంపై విరుచుకుపడే యుద్ధ సన్నివేశాలను సురేందర్ రెడ్డి ఎంతో చాక చక్యంగా చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. బ్రిటిష్ కాలం నాటి తుపాకులు, అలాగే బ్రిటిష్ సైన్యం, అప్పటి కాలాన్ని తలపించేవిగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట. ఇక ఈ భారీ యాక్షన్ పార్ట్ సినిమా కే హైలెట్ గా నిలుస్తుందని ఎప్పటినుండో చెబుతున్నారు. మరి ఈ భారీ షెడ్యూల్ లో తెరకెక్కించిన సన్నివేశాలు నిజంగానే సై రా సినిమాకి తలమానికమని ఆ సినిమా కెమెరా మెన్ రత్నవేలు చెబుతున్నాడు. ఈ సినిమా కి సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు... ఈ షెడ్యూల్ విశేషాలను వివరిస్తూ... ఈ యాక్షన్ పార్ట్ తియ్యడానికి చాలాకష్టపడ్డామని.. వర్షాల కారణంగా... సరైన వెలుతురు లేని ప్రదేశం లోను ఈ సినిమా షూటింగ్ చేశామని... అలాగే ఆంగ్లేయుల ఆర్మీ, ఫిరంగులు, గుర్రాలతో బరిగా ఈ యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించామని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్ని తట్టుకుని ఈ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశామని చెబుతున్నాడు.
మరి ఇంత భారీ సన్నివేశాలు, సినిమా కి అత్యంత కీలకమని చెబుతున్న, ఈ యుద్ధ సన్నివేశాలను కేవలం 35 రోజుల్లోనే ముగించేశారట. ఇక ఈ షెడ్యూల్ రష్ చూసిన చిరంజీవి ప్రత్యేకంగా దర్శకుడు సురేందర్ రెడ్డిని మెచ్చుకున్నట్లుగా సమాచారం. మరి ఈ యుద్ధ సన్నివేశాల్లోనే కిచ్చ సుదీప్ పాల్గొన్నాడు. ఇక ఈ సినిమా లో అమితాబ్, నయనతార, తమన్నా, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి స్టార్ కాస్ట్ కూడా నటిస్తున్నది. ఇక తదుపరి షెడ్యూల్ కొద్దీ రోజుల్లోనే ప్రారంభమవుతుందని చిత్ర బృందం చెబుతుంది.