Actor Mohan Babu: "Vote for Glass"- జనసేనకి ఓటు వెయ్యండి అంటున్న మోహన్ బాబు, మనోజ్..
ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి ఓటు వెయ్యండి అంటూ మోహన్ బాబు, మంచు మనోజ్ ఇన్‌డైరెక్ట్ గా కామెంట్స్ చేసారు.
Actor Mohan Babu: "Vote for Glass"-ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల చాలా రసవత్రంగా మారాయి. వైస్సార్సీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఐదు పార్టీల నుంచి బలమైన నేతలు బరిలో నిలుస్తున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. కాగా పవన్ కళ్యాణ్ కి ఈసారి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొంచెం సపోర్ట్ వస్తున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో జనసేన గురించి సినీ పరిశ్రమకి చెందిన ఏ వ్యక్తి మాట్లాడలేదు.
కానీ ఇప్పుడు కొందరు టాలీవుడ్ నిర్మాతలు, డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్స్.. డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగి జనసేనకి మద్దతు ఇవ్వండి అంటూ ప్రజలను కోరుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా మంచు ఫ్యామిలీ కూడా ఇన్‌డైరెక్ట్ గా జనసేనకి ఓటు వెయ్యండి అంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.రీసెంట్ గా మోహన్ బర్త్ డేని.. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అతిథిగా వచ్చారు.
ఇక ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ వేదిక పై మాట్లాడుతూ.. "డబ్బు ఇస్తే తీసుకోండి. కానీ డబ్బు ఎక్కువ ఇచ్చారు కదా అని, వాళ్ళకే ఓటు వెయ్యకండి. మీకు మరియు పేదవారికి సహాయపడే నాయకుడికి మాత్రమే ఓటు వెయ్యండి. అలోచించి, అంచనాలు వేసుకొని.. ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుందో వారికీ ఓటు వెయ్యండి. ఆ మంచి జరగడం కోసం నలుగుర్ని కలుపుకుని వెళ్లే నాయకుడికి ఓటు వెయ్యండి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ విన్న నెటిజెన్స్.. మనోజ్ అన్న ఇన్‌డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యమని చెబుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే ఈవెంట్ లో మోహన్ బాబు కూడా మాట్లాడుతూ.. "మోదీ లాంటి వ్యక్తి దేశానికి చాలా అవసరం. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు పార్టీలు ఓటు కోసం డబ్బులు ఇస్తాయి. ఆ డబ్బులు మనవే, వాళ్లు లంచాలు తీసుకోని సంపాదించిన డబ్బు అది. ఓటర్లు ఆ డబ్బు తీసుకోవడం తప్పు లేదు. కానీ ఓటు మాత్రం రాష్ట్రానికి మంచి చేసేవారికి వేసి.. రాష్ట్రాభివృద్ధి మరియు దేశాభివృద్ధికి సహకరించాలి" అంటూ వ్యాఖ్యానించారు.