కరోనా లాక్ డౌన్ తో లైన్లోకొచ్చారా? లేదంటే.. !!

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వలన ఇదివరకు అనుకున్న అంచనాలన్నీ మారిపోయాయి. కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసే ఆలోచన ని పక్కనబెడుతున్నారు. అలాగే స్టార్ కూడా [more]

Update: 2020-07-08 08:43 GMT

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వలన ఇదివరకు అనుకున్న అంచనాలన్నీ మారిపోయాయి. కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసే ఆలోచన ని పక్కనబెడుతున్నారు. అలాగే స్టార్ కూడా ఇదివరకులా భారీ రెమ్యునరేషన్ కోసం ఆశ పడకూడదు. అసలు సినిమాలు మళ్ళీ థియేటర్స్ వద్ద నిలుస్తాయంటే నమ్మకం లేని టైం లో ఓటిటి డిజిటల్ ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. ఇది వరకు వెబ్ సీరీస్ అంటే కాస్త చీప్ గా చూసే తారలంతా ఇప్పుడు వెబ్ సీరీస్ వెంట పడుతున్నారు. కారణం నూటికి నూరు శాతం కరోననే కాదు.. వెబ్ సీరీస్ ప్రాధాన్యం బాగా పెరుగుతూ రావడంతో అవాకాశాలు తగ్గిన హీరోయిన్స్ అంత వెబ్ సీరీస్ వైపు కదులుతున్నారు. ఇప్పటికే సమంత లాంటి టాప్ హీరోయిన్ వెబ్ సీరీస్ లో నటించింది.

ఇక తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా వెబ్ సీరీస్ కి జై కొట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. అవకాశాలు లేని టైం లో తమిళంలో జానూ తో హిట్ కొట్టి.. వరస అవకాశాలతో బాగా బిజీ అయిన త్రిష కూడా వెబ్ సీరీస్ లో నటిస్తుంది అనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్. ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి త్రిష కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహిస్తారని అంటుంటే.. ఈ కథ మొత్తంతండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషనల్ గా నడిచే కథగా రూపొందుతుందట. మరి కరోనా లాక్ డౌన్ తో తారలోకం ఆలోచనలు బాగా మారినట్టుగా అనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News