కోర్టు చెప్పాక ఇంకేం చేస్తారు!!

కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్నప్పటికీ.. చాలామంది హీరోలు మెల్లగా తమ తమ షూటింగ్స్ ని మొదలు పెడుతున్నారు. టాలీవుడ్ హీరోలు మాత్రం కదలడం లేదు కానీ.. బాలీవుడ్ హీరోలు [more]

Update: 2020-08-09 08:09 GMT

కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్నప్పటికీ.. చాలామంది హీరోలు మెల్లగా తమ తమ షూటింగ్స్ ని మొదలు పెడుతున్నారు. టాలీవుడ్ హీరోలు మాత్రం కదలడం లేదు కానీ.. బాలీవుడ్ హీరోలు మెల్లిగా తమ దైనందిన కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్ స్పాట్ కి వెళతారనుకుంటే చాలామంది బాలీవుడ్ హీరోలు కరోనా కి భయపడక్కర్లేదు అంటూ షూటింగ్స్ కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమర్ లాంటి వాళ్ళు తమ సినిమా షూటింగ్ కోసం లండన్ కూడా చెక్కేశారు. ఇక అందరూ మెల్లిగా షూటింగ్స్ కోసం రెడీ అవుతుంటే.. ఇప్పుడు ముంబై హీ కోర్టు ప్రత్యేకించి కొంతమంది నటులకు కళ్లెం వేసింది.

ముంబై లో కరోనా పెరిగిపోతున్న కారణంగా బాలీవుడ్ లో చాలామంది  కరోనా బారిన పడడంతో..65 ఏళ్లు పై పడిన నటీనటులు, టెక్నిషియన్స్ ఎవరు షూటింగ్స్‌లో పాల్గొనడానికి వీలు లేదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ముంబై హై కోర్టు ఆదేశానుసారం 65 ఏళ్ళు పైబడిన నటీనటులు, టెక్నీకల్ సిబ్బంది ఎవరూ అటు సినిమాల షూటింగ్స్ లోను ఇటు సీరియల్స్ షూటింగ్స్ లోను పాల్గొనకూడదని స్పష్టం చేసింది. దానితో  మెగా స్టార్ అమితాబ్ దగ్గరనుండి మెగాస్టార్ చిరు వరకు ఇప్పుడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనటానికి వీలు లేకుండా పోయింది. అందులోను అమితాబచ్చన్ ఫ్యామిలీ మొత్తం కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అందుకే ముంబై హై కోర్టు పెద్దలకు నో షూటింగ్ అంటూ ఆజ్ఞలు జారీ చేసింది.

Tags:    

Similar News