బాబు మురుగా నువ్వు కూడానా?

కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించే సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చ క్రేజ్. అందుకే మురుగదాస్ సినిమాలు ఎక్కువ తెలుగులో రీమేక్ అవడమే కాదు.. డబ్ అయినా ఆ [more]

Update: 2020-01-10 05:26 GMT

కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించే సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చ క్రేజ్. అందుకే మురుగదాస్ సినిమాలు ఎక్కువ తెలుగులో రీమేక్ అవడమే కాదు.. డబ్ అయినా ఆ సినిమాలను పిచ్చిగా ఆరాధిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే మురుగదాస్ కి సమాజం పట్ల, దాని సమస్యల పట్ల ఒక అవగాహనా ఉండడమే కాదు… దానికి ఆయన స్పందించే తీరు వేరుగా వుంటుంది. అందుకే మురుగదాస్ సినిమాల్లో ఎప్పుడూ ఓ సోషల్ మెసేజ్ ఉంటుంది. అయితే తాజాగా రజినీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ లో మాత్రం సోషల్ మెసేజ్ అనేది ఎక్కడా వెతికినా కనబడలేదు. సంక్రాతి కి వచ్చిన మొదట సినిమా దర్బార్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కేలా కనిపించడం లేదు. కారణం మురుగదాస్ కూడా రజినీకాంత్ స్టయిల్ ని ఫాలో అవడమే కాదు.. రజినీకాంత్ ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా మారిపోయాడు.

మురుగదాస్ – రజినీకాంత్ కాంబోలో దర్బార్ సినిమా అనుకున్నప్పటి నుండి ఆ సినిమాపై పెద్ద అంచనాలే ఉన్నాయి. రజిని గత సినిమాల ట్రాక్ రికార్డ్ వదిలేసి.. దర్బార్ పై మురుగదాస్ వలన అంచనాలు పెరిగాయి. కానీ నిన్న విడుదలైన దర్బార్ సినిమా ఆ అంచనాలు అందుకోలేకపోయింది. కారణం మురుగదాస్ తన స్టయిల్ వదిలేసి రజిని ఫ్యాన్స్ ట్రాక్ లో వెళ్ళిపోయాడు. కథని వదిలేసి స్క్రీన్ ప్లే పట్టుకున్నాడు. కేవలం రజినీకాంత్ అభిమానుల కోసం ఈ సినిమా తీసాడేమో అని అనిపించక మానదు. రజినీకాంత్ స్టయిల్, ఆయన ఎనర్జీ నటన తో వన్ మ్యాన్ షో చేసిన.. దర్బార్ కి కథ మైనస్, అలాగే అనిరుద్ పాటలు అంతగా లేకపోవడం, మురుగదాస్ మార్క్ మేకింగ్ కొరత, ఫస్ట్ హాఫ్ బావున్నా, సెకండ్ హాఫ్ పరమ బోర్, ఓపెనింగ్ ఫైట్, రజనీ స్టయిల్ తప్ప సినిమాలో ఏమి కనిపించలేదు. ఓ సాదా సీదా క్లయిమాక్స్ ను అల్లి.. సినిమా ని మమ అనిపించితిన్ ఫీలింగ్ కలిగింది. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు సీన్స్ తప్ప ఎక్కడా మురుగదాస్ మార్క్ డైరెక్షన్ లేకపోవడం, గత దర్శకులు వలే మురుగదాస్ కూడా రజినీకాంత్ స్టయిల్ మీద, ఆయన హీరోయిజం మీద ఫోకస్ చేసి అభిమానులు మెచ్చేలా సినిమాతీసాడు కానీ.. అందరూ మెచ్చేలా మాత్రం రజిని ని చూపించలేకపోయాడు

Tags:    

Similar News