నభ నటేష్ గ్లామర్ వేస్ట్ అయ్యింది!

నన్ను దోచుకుందువటే సినిమాతో డీసెంట్ గా ట్రెడిషనల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాభ నటేష్ ఇస్మార్ట్ శంకర్ తో గ్లామర్ గేట్లు తెరిచేసింది. గ్లామర్ గర్ల్ [more]

Update: 2021-01-16 08:38 GMT

నన్ను దోచుకుందువటే సినిమాతో డీసెంట్ గా ట్రెడిషనల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాభ నటేష్ ఇస్మార్ట్ శంకర్ తో గ్లామర్ గేట్లు తెరిచేసింది. గ్లామర్ గర్ల్ లా ఇస్మార్ట్ శంకర్ లో నాభ నటేష్ తెలంగాణ యాస తో చేసిన ఎక్సపోజింగ్ తో ఇక టాలీవుడ్ లో పాపకి ఎదురు లేదనిపించింది. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వరస ఆఫర్ అందుకున్న నభ నటేష్.. ఇస్మార్ట్ అంత గొప్ప హిట్స్ కొట్టలేకపోతుంది. అంటే ఇస్మార్ట్ అంత గ్లామర్ చూపించినా నభకి పెద్దగా వర్కౌట్ అవడం లేదు. సాయి ధరమ్ తో నటించిన సోలో బ్రతుకే సో బెటర్ నభకి సో సో హిట్ ఇచ్చింది. తర్వాత అల్లుడు అదుర్స్ తో అదరగొడదామనుకుంటే.. అల్లుడు అదుర్స్ చూసి ఆడియన్స్ బెదిరిపోతున్నారు. 

నభ నటేష్ సోలో బ్రతుకు సో బెటర్ సినిమా తో కాస్త మిక్స్డ్ హిట్ అయినా అందుకుంది. అల్లుడు అదుర్స్ తో ఆ మాత్రం హిట్ కూడా కొట్టలేకపోయింది. ఆ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ లో బాడీ లాంగ్వేజ్, భాషలో యాస చూపించినా నభకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నభ నటేష్ అందాలు ఫిదా చేసినా సినిమాకొచ్చిన టాక్ తో నభ ఎంతగా గ్లామర్ షో చేసినా వృధా ప్రయాస తప్ప మరేమి లేదంటారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మళ్ళీ కథలో అంత ఇన్వాల్వ్ అయిన పాత్ర మాత్రం నభకి దొరకడం లేదు. మరి సోలో తో సో సో హిట్ కొట్టిన నభకి అల్లుడు అదుర్స్ మాత్రం బెదరగొట్టేసాడు.

Tags:    

Similar News