ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరం లేదు అంటున్న నాగార్జున!

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మన్మథుడు 2 సినిమా 13 ఏళ్ళ క్రితం వచ్చిన ఫ్రెంచ్ మూవీ ప్రెతె మోయితా మైను ఆధారంగా చేసుకున్నదంటూ [more]

Update: 2019-06-19 12:43 GMT

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మన్మథుడు 2 సినిమా 13 ఏళ్ళ క్రితం వచ్చిన ఫ్రెంచ్ మూవీ ప్రెతె మోయితా మైను ఆధారంగా చేసుకున్నదంటూ గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అయితే నాగ్ అండ్ రాహుల్ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అనుకుంటున్నారు ఫ్యాన్స్. అజ్ఞాతవాసి టైంలో కూడా త్రివిక్రమ్ స్టోరీ మొత్తం లేపేసి షూటింగ్ చేయడం అప్పటిలో పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భయపడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.

అయితే నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తరఫున సదరు ఫ్రెంచ్ సినిమా హక్కులను రీజనబుల్ గా కొనేసాడని విశ్వసనీయ సమాచారం అందుతుంది. స్టోరీ ని తీసుకుని రాహుల్ ఇక్కడ మన నేటివిటీ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసారని తెలుస్తుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెల లో ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశముంది.ఆగస్టు 9 న ఈమూవీ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News