ఇది మరీ బాగుంది నాగ్..!

సమంత – నాగ చైతన్య పెళ్ళై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. పెళ్ళికి ముందే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న చై – సామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. [more]

Update: 2019-04-01 08:19 GMT

సమంత – నాగ చైతన్య పెళ్ళై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. పెళ్ళికి ముందే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న చై – సామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ప్రేమలో ఉన్నన్ని రోజులు కనీసం మీడియాకి కూడా తెలియలేదు. వారు లవ్ లో ఉన్న విషయం పెళ్లికి ఏడాది ముందు మాత్రమే మీడియా పసిగట్టింది. ఆ తరవాత ఈ క్యూట్ జంట ఓపెన్ అయ్యింది. అయితే ఇంతకాలానికి వారి ప్రేమ పెళ్లి విషయంపై నాగార్జున మజిలీ ఈవెంట్ లో అభిమానులతో పంచుకున్నాడు. చైతు – సామ్ ప్రేమ వ్యవహారం తనకు అసలు తెలియదని… మనం సినిమా షూటింగ్ లో తనకు తెలియకుండానే సమంత, చైతు సీక్రెట్ గా రొమాన్స్ చేసుకున్న తనకి ఎంత మాత్రం తెలియదని చెప్పాడు నాగ్.

కుక్క ముందే కనిపెట్టింది…

‘‘ఒకసారి సమంత తన ఇంటికి వచ్చినప్పుడు.. సమంత మొదటిసారి మా ఇంటికొచ్చిందని అనుకున్నాను. కానీ మా కుక్క మాత్రం సమంత రాగానే దగ్గరికి వెళ్లేసరికి నేను షాక్. అపుడు సమంత మీ కుక్కతో నాకు చాలాకాలం నుండి పరిచయం ఉందని చెప్పింది. నాకు తెలియని విషయం మా కుక్క కనిపెట్టింది’’ అంటూ జోవియల్ గా చై – సామ్ ల ప్రేమ విషయాలు ముచ్చటించాడు. మరి వారి తెరచాటు ప్రేమ వ్యవహారం చాలారోజుల వరకు తనకి తెలియదని నాగార్జున చెప్పడం మాత్రం హాట్ టాపిక్కే. ఇక చైతు – సామ్ జంటగా నటించిన మజిలీ మూవీ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News