నానిని అలా పడేశాడా?

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా తాజాగా ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మిక్స్డ్ టాక్ తో సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. [more]

Update: 2020-09-06 06:55 GMT

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా తాజాగా ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మిక్స్డ్ టాక్ తో సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఐదారునెలలుగా థియేటర్స్ మూత పడడం ఆయమన్న సినిమాలేక ప్రేక్షకులంతా చిరాకుగా ఉన్న టైం లో వి సినిమా విడుదల కావడంతో కాస్త కంటెంట్ రొటీన్ గా అనిపించినా ప్రేక్షకులు మాత్రం వి సినిమా కోసం ఎగబడ్డారు. అయితే ఈ సినిమాకి వి టీం చేసిన ప్రమోస్షన్స్ కూడా వి సినిమా క్రేజ్ కి ఒక కారణం. నాని, నివేత థామస్, సుధీర్ బాబు అందరూ వి సినిమాని బాగా ప్రమోట్ చేసారు. అందుకే ప్రమోషస్న్ లో టాప్ అయినందువలనే కంటెంట్ వీక్ అయినా వి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారంటున్నారు.

అయితే వి సినిమా కథని ముందు ఇంద్రగంటి – దిల్ రాజు ముందుగా బన్నీకి కి వినిపించగా రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పి రిజెక్ట్ చెయ్యడంతో.. సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లగా ఆల్రెడీ నేను జవాన్ మూవీ ఇలాంటి కథ తోనే చేశాను. మల్లి అంటే సెట్ కాదనేశాడట. తర్వాత అష్టాచెమ్మా, జంటిల్మన్ సినిమాలు చేసిన నాని కి హీరో సుధీర్ బాబుకి కథ వినిపించగా నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి అనుకుని ఈ సినిమాని ఒప్పుకున్నాడట. అందులోను సుధీర్ బాబు కన్నా ఒకింత నాని పాత్రే హైలెట్ అవడంతో నాని వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాడట. ఇక సుధీర్ బాబు సమ్మోహనం ఇంద్రగంటి తో చేసి ఉండడం.. అందులోను వి లోని పవర్ పాత్రలాంటి పాత్ర మరే సినిమాలోని చేయకపోవడంతో ఈ సినిమా ఒప్పేసుకున్నాడా. సో చివరికి నాని – సుధీర్ బాబులు కలిసి వి చేశారన్నమాట.

Tags:    

Similar News