Balakrishna : దటీజ్ లెజెండ్…. మంచి మనసుకు నిదర్శనం

బాలయ్య బాబు బోళా మనిషి. తాను అరచినా వెంటనే అక్కున చేర్చుకునే మనస్తత్వం ఆయనది. తాజాగా బాలకృష్ణ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల బాలయ్య [more]

Update: 2021-11-08 06:46 GMT

బాలయ్య బాబు బోళా మనిషి. తాను అరచినా వెంటనే అక్కున చేర్చుకునే మనస్తత్వం ఆయనది. తాజాగా బాలకృష్ణ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల బాలయ్య ఒక షోలో అజీజ్ అనే వ్యక్తి గురించి వీడియో చూపారు. అజీజ్ సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని ఆ వీడియోలో చూపించారు. దీనికి బాలకృష్ణ వెంటనే స్పందించారు. తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చారు.

మోహాన్ బాబును….

అజీజ్ తన సోదరి కోసం కూలి పని చేయడం బాలయ్యను కదిలించింది. అజీజ్ కు ఉచితంగా విద్యను అందించాలని మోహన్ బాబును కూడా కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజీజ్ సోదరి బేగం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో బాలయ్య పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Tags:    

Similar News