నాని ‘జెర్సీ’పై అప్పుడే విమర్శలు..!

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమా రంగంలోకి దర్శకుడు కావాలని వచ్చిన నాని అష్టాచెమ్మా, పిల్ల జమీందార్‌ వంటి చిత్రాలతో సత్తా చాటాడు. కానీ జెండాపై కపిరాజు, పైసా [more]

Update: 2019-01-16 11:44 GMT

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమా రంగంలోకి దర్శకుడు కావాలని వచ్చిన నాని అష్టాచెమ్మా, పిల్ల జమీందార్‌ వంటి చిత్రాలతో సత్తా చాటాడు. కానీ జెండాపై కపిరాజు, పైసా వంటి చిత్రాల సమయంలో ఆయన కెరీర్‌ తీవ్ర ప్రమాదంలో పడింది. కానీ ఎంతో కాన్ఫిడెంట్‌గా, దర్శకత్వంపై, కథలపై ఉన్న జడ్జిమెంట్‌తో ఆయన వెంటనే కొత్త దర్శకుల సహాయంతో వరుస హిట్స్‌ కొట్టాడు. ఏకంగా నేచురల్‌ స్టార్‌ స్థాయికి ఎదిగాడు. భలే భలే మగాడివోయ్‌, ఎంసీఏ, నిన్ను కోరి, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, నేను లోకల్‌, ఇలా ఆయన విజయ యాత్ర అప్రతిహతంగా సాగింది. నాని ఎంచుకునే సబ్జెక్ట్‌ లు విజయవంతమైనవా? లేక ఆయన నటించిన చిత్రాలన్నీ విజయవంతం అవుతాయా? అనే సందేహాలు వచ్చే విధంగా ఆయన కెరీర్‌ కొనసాగింది. కానీ ఈ వరుస విజయాలకు ‘కృష్ణార్జున యుద్దం’తో బ్రేక్‌ పడింది. ఆ తర్వాత నాగార్జునతో చేసిన మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’ కూడా రొటీన్‌ అనే విమర్శలను ఎదుర్కొంది.

హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో…

దీంతో నాని కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తూ ప్రస్తుతం గౌతమ్‌ దర్శకత్వంలో క్రికెట్‌ నేపథ్యంలో ‘జెర్సీ’ అనే చిత్రం చేస్తున్నాడు. క్రీడల నుంచి రిటైర్‌ అయ్యే వయసులో ఆటపై మమకారం పెంచుకుని క్రికెటర్‌ కావాలనే కోరికతో నిరుత్సాహపూరిత వాతావరణాన్ని కూడా ఎదిరించి నాని క్రికెటర్‌గా ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇటీవల విడుదలైన టీజర్‌ ద్వారా అర్థమైంది. ఈ టీజర్‌ చూసిన వారు ఈ సారి నాని మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టి గాడిలో పడటం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియా విస్తారంగా వ్యాపించిన నేపధ్యంలో ఈ చిత్రం హాలీవుడ్‌ మూవీ అయిన ‘ఇన్విన్సిబుల్‌’కి స్ఫూర్తిగా తీసుకుని తీస్తున్నారనే ప్రచారం సాగింది. ‘ఇన్విన్సిబుల్‌’ ఇలాంటి లేట్‌ వయసు స్పోర్ట్స్‌ మెన్‌ నేపథ్యంలోనే అయినా ఫుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. మన దేశంలో ఫుట్‌బాల్‌తో పాటు అన్ని క్రీడల కంటే క్రికెట్‌ని పిచ్చిగా, ఓ మతంగా కొలిచే పరిస్థితి ఉండటంతో ‘జెర్సీ’కి నేపథ్యంగా క్రికెట్‌ని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. స్ఫూర్తి పొందడం తప్పు కాదు గానీ దానిని మన నేటివిటీకి తగ్గట్లు ఎలా మార్పులు చేర్పులు చేశారో వేచి చూడాల్సి ఉంది…!

Tags:    

Similar News