పుష్ప 2 సెట్స్ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్..

జాతీయ అవార్డులతో వచ్చిన ఫేమ్ ని పుష్ప టీం పార్ట్ 2 ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడానికి సిద్ధం అయ్యింది. ఈక్రమంలోనే నేడు అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ నుంచి ఒక స్పెషల్ వీడియోని షేర్ చేశాడు.

Update: 2023-08-30 04:16 GMT

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సినిమా పుష్ప (Pushpa). రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఎంతటి విజయ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ఈ సినిమాకు గాను రెండు నేషనల్ అవార్డులు కూడా రావడంతో సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ జాతీయ అవార్డులు అందుకున్నారు.

ఇక ఈ అవార్డులతో వచ్చిన ఫేమ్ ని మూవీ టీం పార్ట్ 2 ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడానికి సిద్ధం అయ్యింది. ఈక్రమంలోనే నేడు అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ నుంచి ఒక స్పెషల్ వీడియోని షేర్ చేశాడు. ఉదయం తన ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టి తన లైఫ్ స్టైల్ చూపిస్తూనే పుష్ప 2 సెట్స్ కి తీసుకు వెళ్ళాడు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక ఆ సెట్స్ తన మేకప్, డ్రెస్సింగ్, వెపన్స్.. ఇలా ప్రతి విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులతో పంచుకున్నాడు.
అలాగే సెట్స్ ఒక సీన్ ని చిత్రీకరిస్తున్న సన్నివేశాన్ని కూడా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి నేషనల్ అవార్డు కూడా అందుకున్న పుష్ప రాజ్ తన రూల్ ని ఎప్పుడు మొదలు పెడతాడో. వచ్చే ఏడాది మార్చి 22న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా సునీల్, ధనంజయ్, అనసూయ, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News