పెళ్లి కోసేమే పూజలా?

ఈ కరోనా టైం లో నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోబోతుంది అనే టాక్ గత నెలలో కోలీవుడ్ మీడియాలో నడిచింది. లేడి సూపర్ [more]

Update: 2020-08-06 13:59 GMT

ఈ కరోనా టైం లో నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోబోతుంది అనే టాక్ గత నెలలో కోలీవుడ్ మీడియాలో నడిచింది. లేడి సూపర్ స్టార్ నయనతార మూవీస్ తో ఎప్పుడు బిజినే. అలాగే వ్యక్తి గత జీవితంలోను ప్రేమ విషయంలో బాగా పాపులర్ అయ్యింది. శింబు, ప్రభు దేవా తాజాగా విఘ్నేష్ శివన్.. ఇలా మూడు ప్రేమ కతలు నయనతారవి. మొన్నామధ్యన వనితా విజయ్ కుమర్ నయనతారని తన మూడు పెళ్లిళ్ల విషయంలోకి లాగి నయనతార అభిమానులకు అడ్డంగా బుక్ అయినా… నయనతార మరిచిపోయిన గాయాన్ని గుర్తుచేసింది. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్స్ సమయంలోనే నయనతార విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకోబోతుంది అని.. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని.. తర్వాత మీడియాకి చెబుదామనుకుంటుందట ఈ జంట.

అందుకే విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార గుళ్ళు గోపురాలు తిరుగుతూ పూజలు చేయిస్తుందని టాక్ కోలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఇపప్టికే కొన్ని దేవాలయాలను చుట్టేసిన నయనతార త్వరలో కుంభకోణంలోని తిరునగేశ్వరం రాహు దేవాలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయనుందని సోషల్ మీడియా టాక్. త్వరలో జరగనున్న తమ పెళ్ళికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో నయనతార ఈ పూజలు చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి కరోనా టైం లో సైలెంట్ గా పెళ్లి చేసుకుంటే.. ఎవరూ పట్టించుకోరని నయన్ ప్లాన్ లాగా ఉంది. అందుకే ప్రియుడిని వెంటేసుకుని గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ బిజీ బిజీగా మారింది.

Tags:    

Similar News