వివాదంలో నయనతార.. అక్కడ చెప్పులు ఎందుకు వేసుకున్నావ్

అక్కడ చెప్పులు ఎందుకు వేసుకున్నావ్.. వివాదంలో నయనతార..

Update: 2022-06-10 12:33 GMT

ప్రముఖ సినీ నటి నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల పెళ్లి మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్టులో వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి విచ్చేశారు. వివాహానంతరం ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు అత్యంత పవిత్రమైనవి. మాడవీధుల్లో చెప్పులు వేసుకుని నడవడం నిషేదం. నయనతార గారు ఇలా చెప్పులు వేసుకుని తిరిగినందుకు స్వామి వారిని క్షమాపణ కోరండి. " అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.


మరో వైపు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె శుక్రవారం తిరుమలకు వచ్చింది. తన తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణెతో కలసి ఆమె తిరుమలకు వచ్చింది. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకుంది. ప్రకాష్ పదుకొణె 67వ పుట్టిన రోజు కావడంతో స్వామి దర్శనానికి వారు విచ్చేశారు. దర్శనం తర్వాత ఆలయం ముందు భాగంలో మాస్క్ ధరించి దీపికా కెమెరా కళ్లకు చిక్కింది. దీపిక వెంట తండ్రితోపాటు సోదరి అనీష పదుకొణె కూడా ఉంది.


Tags:    

Similar News