ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ అంత నచ్చిందా?

బోలెడన్ని డిజాస్టర్స్ తో మళ్ళీ ప్లాప్ ట్రాక్ ఎక్కిన నితిన్ ఇప్పుడు వరసగా కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ [more]

Update: 2019-03-24 05:50 GMT

బోలెడన్ని డిజాస్టర్స్ తో మళ్ళీ ప్లాప్ ట్రాక్ ఎక్కిన నితిన్ ఇప్పుడు వరసగా కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ చిత్రం చేస్తున్ననితిన్… హోలీ రోజున ప్లాప్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక మూవీ ఎనౌన్స్ చేసాడు. ఇక ప్లాప్ డైరెక్టర్ తో నితిన్ సాహసం అంటూ.. మీడియాలో న్యూస్ లు కుప్పలు తెప్పలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక రమేష్ వర్మ తో నితిన్ సినిమా అంటూ ప్రచారం జరిగినా.. నితిన్ ఆ న్యూస్ ఫెక్ న్యూస్ అంటూ స్పందించడంతో… ఆ సినిమా లేదని తేలిపోయింది. ఇక నితిన్ చంద్రశేఖర్ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యి ఆయనతో సినిమా అనౌన్స్ చేసాడు.

అయితే చంద్ర శేఖర్ యేలేటి నితిన్ కి చెప్పిన కథే మరో ఐదుగురు హీరోలకు చెప్పగా.. ఆ హీరోలంతా చంద్ర శేఖర్ యేలేటి కథని రిజెక్ట్ చెయ్యగా.. చివరికి ఆ కథ నితిన్ వద్దకు చేరగా.. నితిన్ ఓకె చేసాడంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చంద్ర శేఖర్ ఈ కథను తయారు చేసి హీరోలకు వినిపించాడట. అయితే చంద్ర శేఖర్ యేలేటి కథ చెప్పిన హీరోలెవరో తెలుసా… ఎన్టీఆర్ నుండి నాని, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌, గోపీచంద్‌లు ఈ కథను రిజెక్ట్ చేసిన వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పెద్ద హీరోలే చెయ్యనని చెప్పిన ఆ కథ నితిన్ కి ఎలా నచ్చిందో. అసలే ప్లాప్స్ లో ఉన్న నితిన్… మల్లి ఇలా ప్లాప్ డైరెక్టర్ కి కనెక్ట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న నితిన్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ నితిన్ కి నచ్చడం ఏమిటంటూ తలలు పట్టుకుంటున్నారట.

ఇకపోతే ఏడాది కాలంగా మైత్రి మూవీస్ నిర్మాణంలో సినిమా చేస్తానని చెప్పిన.. చంద్ర శేఖర్ యేలేటి ఇప్పుడు మైత్రి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి మరీ… భవ్య క్రియేషన్స్ లో నితిన్ మూవీ ని పట్టాలెక్కించబోతున్నాడట. ఏప్రిల్ నుండి సెట్స్ మీదకెళ్లాల్సిన ఈ మూవీ సక్రమంగా పట్టాలెక్కుతోంది అంటే.. నమ్మకం లేదంటున్నారు. ఎందుకంటే చంద్రశేఖర్ యేలేటి ఇంకా సెకండ్ హాఫ్ కథను పూర్తిగా ప్రిపేర్ చెయ్యలేదని.. ఆ సెకండ్ హాఫ్ నచ్చకే ఆ టాప్ హీరోలంతా ఆ కథను రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం. మరి నితిన్ కి ఏం చెప్పి ఒప్పించాడో ఈ డైరెక్టర్.

Tags:    

Similar News