కెజిఎఫ్ హడావిడి కనిపించదే!!

కరోనా తో పోస్ట్ పోన్ అయిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ మీదకెళ్ళిపోతున్నాయి. అందరి కన్నా ముందు కన్నడ లో భారీ బడ్జెట్ [more]

Update: 2020-11-04 05:11 GMT

కరోనా తో పోస్ట్ పోన్ అయిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ మీదకెళ్ళిపోతున్నాయి. అందరి కన్నా ముందు కన్నడ లో భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెట్స్ మీదకెళ్లింది. మొదట్లో ఆ సినిమాలో కీలక పాత్ర అధీరా పాత్ర చేస్తున్న సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడడంతో.. కెజిఎఫ్ 2 సినిమా షూటింగ్ ఎమన్నా ఆలస్యం అవుతుందేమో అనుకుంటే.. సంజయ్ దత్ క్యాన్సర్ ని జయించి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. అయితే కెజిఎఫ్ 2 సంక్రాంతికి విడుదలవుతుంది అంటున్నారు కానీ.. దాని హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. దసరాకే కెజిఎఫ్ పోస్టర్ కానీ, కెజిఎఫ్ అప్ డేట్ కానీ వస్తుంది అనుకుంటే కెజిఎఫ్ టీం ఎక్కడా కనిపించలేదు.

సోషల్ మీడియాలోని కెజిఎఫ్ అప్ డేట్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కెజిఎఫ్ హిట్ కావడంతో యావత్ ఇండియా లోని కెజిఎఫ్ సినిమా కోసం అందరిలో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుకే కెజిఎఫ్ సినిమా డేట్ ఎపుడు ఇస్తారా.. సినిమాలోని యశ్ లుక్స్ ఎప్పుడు వదులుతారా? కెజిఎఫ్ టీజర్ దివాళి కైనా ఉంటుందా? అని యశ్ అభిమానులే కాదు… అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ కెజిఎఫ్ నుండి దీపావళి కానుకగా ఎమన్నా అప్ డేట్ లాంటిది ఇస్తారో.. లేదంటే ముందు షూటింగ్ అవ్వనివ్వండి.. తర్వాత అప్ డేట్ గురించి ఆలోచిద్దాం అంటారో చూడాలి.

Tags:    

Similar News