క్రిష్ - బాలయ్య కాంబో ఎన్టీఆర్ బయోపిక్ తో మరోమారు రిపీట్ అవుతుంది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ అవడంతో.. బాలయ్య మరోమారు క్రిష్ కి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక బసవతారకం క్యారెక్టర్ లో విద్యాబాలన్ నటిస్తుంది. నందమూరి తారకరామారావు బయోపిక్ అంటే నట, రాజకీయ జీవితాలను ఎంతో బ్యాలెన్స్డ్ గా చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే నట జీవితం ఎంతో సాఫీగా సాగినా... రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ఎదుర్కున్న ఒడిదుడుకులు అనేక కంట్రవర్సీలు కూడా ఉన్నాయి.
భారీ ఆఫర్ ఇచ్చినా...
మరి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితంలోని ఎలాంటి విషయాలను చూపిస్తారో అనేది ఆ సినిమాలో నటిస్తున్న హీరో బాలకృష్ణకి అంటే ఎన్టీఆర్ కొడుకు కాబట్టి ఆయన డెసిషన్ ఫైనల్. అయితే భారీ హంగులతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అప్పుడే బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజు నెలకొందని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ తెలుగు, తమిళ్, హిందీ రిలీజ్ రైట్స్ ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ లేదా సోని చేజిక్కించుకునే ఛాన్సుందని చెబుతున్నారు. మరి ఈ మూడు భాషలకు కలిపి ఆ బడా సంస్థలు దాదాపుగా 85 కోట్లు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు.
వంద కోట్లైనా వస్తాయని...
కానీ నిర్మాతలు మాత్రం ఆ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టారని.. దానికి కారణం బాలయ్యే అంటున్నారు. బాలకృష్ణ తన తండ్రికున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డీల్ లో 100 కోట్లు వస్తాయని ఆయన మిగతా నిర్మాతలకు చెబుతున్నాడట. మరి 85 కోట్ల డీల్ అంటే మాములు మాటలు కాదు. ఇప్పటికైతే ఎన్టీఆర్ బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదని.. కానీ ఈ డీల్ త్వరలోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ బయో పిక్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయమంటున్నారు.