కొన్ని సినిమాలు రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతాయని వెయిట్ చేస్తుంటాం. ఆ సినిమా ఎలా ఉన్నా ఏమీ పట్టించుకోకుండా సినిమాని చూసేస్తాం. రివ్యూస్, పబ్లిక్ టాక్స్ తో సంబంధం లేకుండా సినిమాని చూసేస్తాం. అలా అనిపించడం చాలా అరుదు. రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి' రెండు పార్ట్స్ విషయంలో అదే జరిగింది. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురుచూసింది. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ప్రతి ఇండస్ట్రీ నుండి ఏదో ఒక సినిమా వస్తూనే ఉంది కానీ ఇప్పటివరకు అందులో కనీసం సగమైనా మరే చిత్రం చేయలేకపోవడానికి కారణమదే. 'బాహుబలి' తరువాత తెలుగు ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ సినిమా కోసం సినీ లవర్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
అందరి ఎదురుచూపులూ సినిమా కోసమే...
ఎన్టీఆర్ గురించి తెలిసిన పాత తరం ఎలాగో ఈ చిత్రాన్ని 'మస్ట్ వాచ్' లిస్ట్ లో ఉంచుతుంది. అలానే యూత్, సినీ లవర్స్ అసలు ఎన్టీఆర్ గురించి తెలియని తరం ఆయనకి ఎందుకంత కీర్తి అని తెలుసుకోవాలనే కుతూహలంతో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్లు. మరి డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని ఆద్యంతం రసవత్తరంగా, ఎన్టీఆర్ ఘనకీర్తిని అన్ని తరాలు మెచ్చే విధంగా రూపొందిస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ తోనే అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. మరి క్రిష్ ఏమి చేస్తాడో చూడాలి. జనవరి 10న 'ఎన్టీఆర్ కథానాయకుడు' రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 7న 'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ చేయనున్నారు.