క్రిష్ కు ముందుంది ముసళ్ల పండగ

డైరెక్టర్ క్రిష్ కు సక్సెస్ రేట్ ఎక్కువ. తీసిన ప్రతి సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని కమర్షియల్‌గానూ విజయవంతమయ్యాయి. తక్కువ బడ్జెట్ తో సినిమా తీసిన [more]

Update: 2019-01-20 08:01 GMT

డైరెక్టర్ క్రిష్ కు సక్సెస్ రేట్ ఎక్కువ. తీసిన ప్రతి సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని కమర్షియల్‌గానూ విజయవంతమయ్యాయి. తక్కువ బడ్జెట్ తో సినిమా తీసిన అందుకు తగ్గట్టు బిజినెస్ చేసి అమ్మడం క్రిష్ కు పేరుంది. ప్రేక్షకుడు పెట్టిన ప్రతి రూపాయి గిట్టుబాటు చేయించడం క్రిష్ కు మొదటి నుండి ఉన్న అలవాటు. కానీ ఎన్టీఆర్ కథానాయకుడు విషయం లో మాత్రం ఫలితం తేడా కొట్టేసింది.

ఈసినిమాను ఏకంగా రూ.70 కోట్లకు అమ్మారు. అయితే అందులో మూడో వంతు కూడా బయర్స్ కి రాలేదంటే ఈసినిమా ఎంతలా డిజాస్టర్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి పరాజయం అందడం క్రిష్ కు ఇదే తొలిసారి. అందుకే క్రిష్ అండ్ బాలకృష్ణ టీం మహాయానాకుడు సినిమాను ఫ్రీ గా బయర్స్ కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ‘మహానాయకుడు’ విషయంలో మాత్రం అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశలేమీ లేవు.

ప్రస్తుతం మహానాయకుడు కు సంబంధించి 10 రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. అయితే చిత్రీకరణలో ఉన్న క్రిష్ టీంలో అసలు ఉత్సాహం కనిపించడం లేదని సమాచారం. ఈనేపధ్యంలో క్రిష్ వదిలేసినా ‘మణికర్ణిక’ 25న విడుదలకు రెడీ అవుతుంది. క్రిష్ ఈసినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి బయటికి వచ్చాడు. చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటె అవి కంగనా తీసిందని చెప్పినా ఆమె..రీసెంట్ గా దర్శకత్వంలో 70 శాతం క్రెడిట్ తనదే అని చెప్పింది. మరి ఆమె డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉంటుందో బాక్సాఫీస్ ఫలితాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ సినిమా ఆడితే క్రిష్ ను తప్పించడం వల్ల నష్టమేమి జరగలేదని కంగనా గ్రేట్ అని అంటారందరూ. అలా కాకుండా సినిమా పోతే కంగనను తిడతారు. క్రిష్‌ను పక్కన పెట్టి తప్పు చేశారని అంటారు. కానీ క్రిష్ సినిమా పోవాలని కోరుకోడు. ఒకవేళ ఆడితే క్రిష్ కు కొంచం ఇబ్బందే. ఒకపక్క మహానాయకుడు సినిమా…మరోపక్క ‘మణికర్ణిక’ రిజల్ట్స్ క్రిష్ ను ఇబ్బంది పెడుతున్నాయి.

Tags:    

Similar News