డిజాస్టర్స్ లో ఇదోరకం

ఏదన్నా సినిమా హిట్ అయితే మరో హిట్ సినిమాతో పోల్చేవారు. అలానే ప్లాప్స్ వస్తే దాని స్థాయి సినిమాలతో పోలుస్తున్నారు. ఫ్లాపుల్లో అట్టర్ ఫ్లాపులు వేరు. అలా [more]

Update: 2019-01-22 05:09 GMT

ఏదన్నా సినిమా హిట్ అయితే మరో హిట్ సినిమాతో పోల్చేవారు. అలానే ప్లాప్స్ వస్తే దాని స్థాయి సినిమాలతో పోలుస్తున్నారు. ఫ్లాపుల్లో అట్టర్ ఫ్లాపులు వేరు. అలా అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది నాగార్జున నటించిన ఆఫీసర్ ఎంత గోరమైన ప్లాపో వేరే చెప్పనవసరం లేదు.

ఇక ఈఏడాది స్టార్టింగ్ లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు దాన్ని మించిపోయింది. జనవరి 9 న రిలీజ్ ఐన ఈసినిమా నిన్నటితో కలిపి చూస్తే ఇప్పటివరకు 19 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈసినిమా థియేట్రికల్ బిజినెస్ 71 కోట్లు కు అమ్మితే అందులో సగం కూడా వెనక్కి రాలేదు. దాదాపు 50 కోట్లు పైనే బయర్స్ కి నష్టం వచ్చింది.

దీనిబట్టి ఈసినిమా ఎంతలా డిజాస్టర్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. కథానాయకుడు ప్రవాభం వచ్చే నెల రిలీజ్ అయ్యే మహానాయకుడు మీద పడింది. అందుకే మహానాయకుడు సినిమా ను కొనటానికి ఎవరు ముందుకు రావడంలేదు. దీంతో కథానాయకుడు సినిమాను తీసుకొని నష్టపోయిన బయ్యర్లకే మహానాయకుడు సినిమాను ఉచితంగా ఇవ్వనున్నారు. ఒకవేళ ఇది కూడా ప్లాప్ ఐతే ఆ బయర్స్ పరిస్థితి ఏంటో…

Tags:    

Similar News