ఎన్టీఆర్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితం గురించి ఏమి చూపిస్తారో అని చాలామంది వెయిట్ చేసారు. ఆసలు ఎన్టీఆర్ ను ఎందుకు దేవుడిలా చూస్తారు..? ఆయన సినిమాలంటే [more]

Update: 2019-02-21 11:55 GMT

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితం గురించి ఏమి చూపిస్తారో అని చాలామంది వెయిట్ చేసారు. ఆసలు ఎన్టీఆర్ ను ఎందుకు దేవుడిలా చూస్తారు..? ఆయన సినిమాలంటే ఎందుకు అంత క్రేజ్..? అని ఈతరం వాళ్లకి అసలు తెలియదు. కాబట్టి అందుకే ఆయన గురించి తెలుసుకోవాలని చాలామంది ఎన్టీఆర్ బయోపిక్ కోసం వెయిట్ చేసారు. అయితే మహానటి సావిత్రి బయోపిక్ మాదిరిగా నిజాలు చూపించడంలో ఎన్టీఆర్ టీం ఫెయిల్ అయింది. ఎన్టీఆర్ కథను నిజాయితీగా, ఆసక్తికరంగా చెప్పడంలో చిత్ర బృందం విఫలమైంది. ఎన్టీఆర్ జీవితంలోని ప్రతికూల కోణాలేమీ చూపించకపో్వడం ఈ సినిమాకు మైనస్ అయిందన్నది మెజారిటీ విశ్లేషకుల మాట. అయితే రీసెంట్ గా వీటిపై నిర్మాత విష్ణు ఇందూరి స్పందించారు.

నిజాలే చూపిస్తున్నాం…

కథానాయకుడులో అతిశయోక్తులేమీ లేవని.. చాలావరకు నిజాలే చూపించామని అన్నాడు. 90 శాతం వరకు ఎన్టీఆర్ నిజ జీవితమే చూపించాం అని ఆయన అన్నారు. కథానాయకుడు ప్రమోషన్స్ అప్పుడు ఎక్కడా కనపడని విష్ణు సడన్ గా మహానాయకుడు రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు ఊహించని విధంగా వార్తల్లోకి వచ్చాడు. ఈ సినిమా విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అని… మేము ఎప్పుడు ఒక అజెండా అంటూ ఏమీ అనుకోలేదని ‘మహానాయకుడు’ సినిమాలో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం కేంద్రంతో పోరాడటం గురించి చూపించామని ఆయన అన్నారు. అలానే ఈ సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.

Tags:    

Similar News