ఎన్టీఆర్ యుద్ధం చేస్తున్నాడట

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో #RRR మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి [more]

;

Update: 2019-06-04 08:23 GMT
NTR #RRR Look
  • whatsapp icon

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో #RRR మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి గాయాలవడంతో… షూటింగ్ కి కాస్త బ్రేకిచ్చిన రాజమౌళి ఇప్పుడు మళ్ళీ #RRR షూటింగ్ ని పట్టాలెక్కిన్చాబోతున్నాడు. ప్రస్తుతం ఎటువంటి హంగామా లేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి… ఆ షూటింగ్ లో కొమరం భీం పాత్రధారి పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సన్నివేశాల్లో కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య ఫైట్ సీన్ ను ఉందట.

Ramcharan NTR Rajamouli cinema shooting started

అయితే ఆ సీన్స్ అన్ని రాత్రివేళలల్లో చిత్రీకరణ జరపాలట. ప్రస్తుతం ఆ నైట్ సీన్ కి సంబంధించే షూట్ జరిగినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ సైన్యంతో తలపడే సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ సరసన ఇంకా హీరోయిన్ ని రాజమౌళి ఫైనల్ చెయ్యలేదు. నిత్యా మీనన్ ఒక హీరోయిన్ గా ఎన్టీఆర్ కి సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఎక్కడా కంఫార్మేషన్ లేదు. ఇక మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు కేరెక్టర్ లో అలియా భట్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.ఇంకా ఈ సినిమా లో అజయ్ దేవగణ్, సముద్రఖని కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు

Tags:    

Similar News