ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలిసి 60 కొట్టేస్తున్నారా?
అలా వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ బాగా మారిపోయింది. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్, అరవింద సమేత యావరేజ్ అయినా.. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తో [more]
అలా వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ బాగా మారిపోయింది. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్, అరవింద సమేత యావరేజ్ అయినా.. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తో [more]
అలా వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ బాగా మారిపోయింది. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్, అరవింద సమేత యావరేజ్ అయినా.. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తో త్రివిక్రమ్ రేంజ్ ఎల్లలు తాకింది. త్రివిక్రమ్ సినిమాలంటే ఎప్పుడూ ఉన్న క్రేజ్ వేరు, అల వైకుంఠం హిట్ తర్వాత ఉన్న క్రేజ్ వేరు. త్రివిక్రమ్ అలా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా మొదలెట్టాడు. త్వరలోనే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ RRR తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దానితో ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలంటే వెర్రెక్కిపోయే ప్రేక్షకులకు పాన్ ఇండియా హీరో అయ్యాక మారేలా ఉంటారో చూడాలి.
అయితే ప్రస్తుతం అలా వైకుంఠపురములో కి త్రివిక్రమ్ పారితోషకం 15 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి హరిక హాసిని, కళ్యాణ్ రామ్ నుండి త్రివిక్రమ్ 20 కోట్లు పారితోషకం అందుకోబోతుంటే.. ఎన్టీఆర్ ఏకంగా 40 కోట్లు.. ప్లస్ కళ్యాణ్ రామ్ వాటాలో షేర్ అందుకోబోతున్నాడట. సినిమా బడ్జెట్ లో సగానికిపైగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ లే పట్టుకెళ్ళిపోతారంటున్నారు. ఇద్దరు కలిపి 60 కోట్లు అంటే.. మిగతా బడ్జెట్ ఎంత పెట్టాలో నిర్మాతలే ఆలోచించాలి. ఎన్టీఆర్ కి 40 కోట్లు అని మాట్లాడినా…. కళ్యాణ్ రామ్ వాటాలో షేర్ తో కలిపి ఎన్టీఆర్ కి దండిగానే ముడుతుంది అంటున్నారు. మరి భారీ బడ్జెట్ అంటున్నారు.. ఆ బడ్జెట్ లో సగం హీరో, దర్శకుడికే తెగితే.. మూవీ బడ్జెట్ ఎంత పెట్టాలి.. ఖర్చులు తగ్గించాలా, లేదంటే క్రేజ్ ఉంది కదా.. ఎడా పెడా పెట్టినా పర్లేదులే అనుకోవాలా.. ఏది ఏమైనా. త్రివిక్రమ్ , ఎన్టీఆర్ రేంజ్ ముందు ఈ పారితోషకాలు ఎంతండీ.