అంతా యాక్షన్ ఎపిసోడ్ కోసం 

కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ‘ఇండియన్ 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రి [more]

Update: 2019-10-18 09:08 GMT

కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ‘ఇండియన్ 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. కమల్ కి జోడిగా కాజల్ నటిస్తున్న ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో కమల్ హాసన్ మొదటి పార్ట్ లానే ముసలోడి గెటప్ లో కనిపించనున్నాడు. అయితే ఈ సారి 90 ఏళ్ల వృద్దుడి పాత్ర అని సమాచారం.

యూరప్, తైవాన్లో షూటింగ్

ఇక ఈ చిత్రంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తెలియజేసారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎపిసోడ్ భోపాల్ లో పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్ పై తెరకెక్కిస్తున్నారని సమాచారం. వెంటనే టీం అంతా మరో షెడ్యూల్ కోసం తైవాన్ , యూరప్ వెళ్లి అక్కడ షూట్ చేయనున్నారు. ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Tags:    

Similar News