చేతులెత్థేసిన పడి పడి లేచే మనసు

హను రాఘవపూడి దర్శకుడిగా రీసెంట్ గా విడుదలైన పడి పడి లేచే మనసు యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను కాస్త బోర్ కొట్టించింది. శర్వానంద్ హీరోగా సాయి [more]

Update: 2018-12-27 03:43 GMT

హను రాఘవపూడి దర్శకుడిగా రీసెంట్ గా విడుదలైన పడి పడి లేచే మనసు యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను కాస్త బోర్ కొట్టించింది. శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం అంతరిక్షం, కెజిఎఫ్ సినిమాల మీద పోటీగా విడుదలైనది. విడుదలకు ముందు మంచి బజ్ తో క్రేజ్ తో విడుదలైన ఈ సినిమా విడుదల తర్వాత సెకండ్ హాఫ్ వీక్ వలన యావరేజ్ టాక్ తెచ్చుకుంది. గతంలో ఎంసీఏ సినిమా కి యావరేజ్ టాక్ పడినా… ఆ సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాలో నాని నటనకు, సాయి పల్లవి నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు సినిమాని హిట్ చేసిపడేసారు. కానీ ఈ పడి పది లేచే మనసులో శర్వా, సాయి పల్లవి వీర లెవల్లో నటించినా హను దర్శకత్వం వలన సినిమాకి యావరేజ్ టాక్ తో పాటుగా యావరేజ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

మరి హను రాఘవపూడి ప్రేమ కథల స్పెషలిస్ట్. అందుకే అల్లు అర్జున్ పడి పడి లేచే మనసు హిట్ అయితే హను కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున హను తో ప్రేమ కథ చెయ్యాలని ఉన్నదని… హనుని లాక్ చేసినట్లుగా మాట్లాడడమే కాదు.. ఆ సినిమా మీదున్న క్రేజ్ తో హను ని కథ చెప్పమని కూడా అడిగినట్లుగా వార్తలొస్తున్నాయి. హను కి బన్నీ కి మ‌ధ్య క‌థ‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం. ఒకవేళ ప‌డి ప‌డి లేచె మనసు హిట్ట‌యితే గ‌నుక‌.. వెంట‌నే బ‌న్నీ.. హ‌నుతో ఓ సినిమా ప్రకటించిన ఆశ్చర్యం ఉండేది కాదంటున్నారు. కానీ పది పది లేచే మనసు కథలో పస లేకపోవడం, హను దర్శకత్వం వీక్ తో పడి పడి లేచే మనసు పడిపోయింది. దెబ్బకి బన్నీ సైడ్ అయ్యాడు. అలా హను, బన్నీ సినిమా మిస్ చేసుకున్నాడు

Tags:    

Similar News