పల్లవి ప్రశాంత్ కు వరుస షాక్ లు.. బెయిల్ పరిస్థితి ఏమిటంటే?

తెలుగు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో

Update: 2023-12-21 13:56 GMT

 pallavi prashanth bail update nampally court

తెలుగు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని.. ప్రశాంత్ కారణంగానే కొందరు యువకులు రెచ్చిపోయారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందునే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని.. పలుమార్లు పోలీసులు ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని రిపోర్టులో తెలిపారు. 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చాకే ప్రశాంత్ ను అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. పల్లవి ప్రశాంత్ కారణంగానే దాదాపు 8 ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి, పలువురు గాయపడ్డారు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు భయం ఉండాలనే ఉద్దేశంతోనే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు. పల్లవి ప్రశాంత్ వల్లే అభిమానులు రోడ్లపైకి వచ్చారని, విధ్వంసం చేశారని, బిగ్ బాస్ షోకి వచ్చిన సెలెబ్రిటీల కార్లు కూడా ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ప్రశాంత్ ను అతడి ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. న్యాయమూర్తి ప్రశాంత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

ఇక పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్ట్ లో నేడు విచారణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కు పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదనిపల్లవి ప్రశాంత్ అడ్వకేట్ అన్నారు. మధ్యాహ్నం నుండి పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వద్దనే ఉండి కూడా జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారన్నారు. సంబంధం లేకున్నా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారని.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడికి బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ అడ్వకేట్ కోర్టును కోరారు.
పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాకే వారి అనుచరులు గొడవ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. డీసీపీ స్థాయి అధికారి అక్కడికి వచ్చి బతిమలాడినా కూడా జనం మాట వినలేదన్నారు. అక్కడ ఉన్న ఆర్టీసి బస్సులను ధ్వంసం చేశారని.. పోలీస్ వాహనాలు పై దాడి చేశారన్నారు. అంతే కాకుండా పోలీసుల పై రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఏ 3 ఇంకా పరారీలో ఉన్నాడు. వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, వీరికి బెయిల్ ఇవ్వవద్దు అంటూ పిపి తన వాదనలు వినిపించారు. నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది.


Tags:    

Similar News