Rashmika Mandanna : డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఏమన్నారంటే?
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రష్మిక ఒక వీడియోను విడుదల చేశారు. డీప్ ఫేక్ వీడియోలపై ఆమె స్పందించారు. ఇటీవల ఆమెపై ఒకడీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ వీడియో సందేశాన్ని ఆమె రిలీజ్ చేశారు. డీప్ ఫేక్ వీడియోలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా సెలబ్రిటీను లక్ష్యంగా చేసుకుని ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
సైబర్ నేరం కింద...
అయితే రష్మిక తన డీప్ ఫేక్ వీడియోను బాగా వైరల్ చేశారని, అదో సైబర్ నేరమని తెలిపారు. ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రష్మిక మందన్న పిలుపు నిచ్చారు. వీటిపై అవగాహన కల్పించేందుకు తాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నానని ఆమె తెలిపారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తుందిని, తాను ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యానని చెప్పుకొచ్చారు. సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో చెప్పలేమని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, దీనిపై కలసి కట్టుగా పోరాడాలని ఆమె పిలుపు నిచ్చారు. ౌ