పిల్లలంటే ఎంతిష్టం పవన్ కి!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు రాజకీయాల్లో ఎంత పెద్ద హాట్ టాపిక్కో అందరికి తెలుసు. పవన్ తాజాగా మూడో భార్యతో ఉంటున్నప్పటికీ.. ఆయన సెకండ్ వైఫ్ రేణు [more]

Update: 2020-12-03 16:29 GMT

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు రాజకీయాల్లో ఎంత పెద్ద హాట్ టాపిక్కో అందరికి తెలుసు. పవన్ తాజాగా మూడో భార్యతో ఉంటున్నప్పటికీ.. ఆయన సెకండ్ వైఫ్ రేణు దేశాయ్ తోనూ పిల్లల కోసం కలుస్తుంటాడు. అటు రాజకీయాలు ఇటు సినిమా షూటింగ్ అంటూ హడావిడిగా పరిగెత్తే పవన్ మాజీ భార్య రేణు తో పిల్లలు అకీరా, ఆద్యల కోసం అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటాడు. ఎందుకు అంటే తన పిల్లలు ఇప్పుడు రేణు దేశాయ్ సంరక్షణలోనే ఉంటున్నారు కాబట్టి. మొన్నామధ్యన హైదరాబాద్ లో పవన్ తన పిల్లలు అకీరా, ఆద్యల కోసం ఇల్లు కొనిపెట్టాడనే టాక్ కూడా ఉంది.

ఎప్పటికప్పుడు పిల్లలను కలుస్తూ తండ్రి ప్రేమ పంచె పవన్ కళ్యాణ్ అకీరా, ఆద్యల పుట్టిన రోజులకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకి వెళ్లి వాళ్ళ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తుంటాడు. గతంలో రేణు దేశాయ్ తన పిల్లలతో పాటుగా పూణేలో ఉండేది. కానీ ఇప్పుడు రేణు దేశాయ్ హైదరాబాద్ కే షిఫ్ట్ అయ్యింది . దానితో పవన్ వీలున్నప్పుడల్లా పిల్లలను కలుస్తూ తండ్రి ప్రేమని కురిపిస్తుంటాడు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్య, కొడుకు అకీరాలని పవన్ కళ్యాణ్ ప్రేమగా హగ్ చేసుకుని ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ వడిలో అకీరా నందన్, ఆద్యలు నిద్ర పోతున్నప్పుడు క్లిక్ మనిపించిన ఆ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆ పిక్ చూసిన ఎవ్వరైనా పవన్ కి పిల్లలంటే ఎంతిష్టమో అని అనకుండా ఉండలేరు.

Tags:    

Similar News