తెలుగులో త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా అందరి మనసులలోకి చొచ్చుకుపోయే సత్తా ఉన్న దర్శకుడు. అందుకే ఆయన సినిమాలకు థియేటర్స్ లో కాసులు రాలేకపోయినా... శాటిలైట్ హక్కులకు కాసుల పంట పండుతుంది. అందుకే ఆయన సినిమాలకు ఛానల్స్ నుండి గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది,. జల్సా సినిమాలు సూపర్ హిట్స్ కాగా.. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్. అయితే అత్తారింటికి దారేది సినిమాతో పవన్, త్రివిక్రమ్ లు ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఇప్పటికీ మా ఛానల్ లో ప్రసారం అవుతుంటే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఆ సినిమా అంత అర్ధవంతంగా ఉంటుంది. అలాగే అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది. అత్త నదియాని తన ఇంటికి తిరిగి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ గౌతమ్ నందగా చేసే ప్రయత్నాలు అందులో భాగంగా అత్తా కూతుళ్లు సమంత, ప్రణీతలను ప్రేమలోకి లాగే ప్రయత్నాలు ఇలా అన్ని విషయాల్లో అత్తారింటికి దారేది ఆకట్టుకుంది.
రీమేక్ రైట్స్ దక్కించుకున్న లైకా
ప్రస్తుతం అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఇక సినిమాలు చేస్తాడో లేదో అనే క్లారిటీ లేదు. ఇకపోతే ఎప్పుడు తమిళంలో హిట్ అయిన సినిమా తెలుగులో రీమేక్ చేస్తుంటారు తెలుగు హీరోలు. అయితే కోలీవుడ్ వాళ్లు మాత్రం తెలుగు సినిమాలను చాలా రేర్ గా రీమేక్ చేసుకుంటారు. ఎందుకంటే తెలుగులో విడుదలైన చాలా సినిమాలు తమిళంలో డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినా అత్తారింటికి దారేది సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ని తమిళంలో బడా నిర్మాతల్లో ఒకరైన లైకా ప్రొడక్షన్స్ వారు చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇంకా క్లారిటీ లేకున్నా...
మరి తెలుగులో విడుదలైన ఐదేళ్లకు ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో రీమేక్ చెయ్యడం అనేది ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ లో తెరకెక్కించిన 2.ఓ సినిమా నవంబర్ 29 న విడుదలకు సిద్దమవుతుంది. అయితే తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్న లైకా వారు తెలుగు అత్తారింటికి దారేది సినిమాను తమిళంలో ఎవరు డైరెక్ట్ చేస్తారో.. అలాగే ఏ హీరో ఈ సినిమా లో నటిస్తున్నాడు, హీరోయిన్స్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు.