పవన్ తో బోయపాటి…. వర్కౌట్ అవుతుందా?
పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో సినిమాలు చేసుకుంటూ బిజెపి, టిడిపి కి మద్దతుగా రాజకీయాల్లోకి దిగాడు. కానీ 2019 ఎన్నికలకు మాత్రం సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి కేవలం [more]
పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో సినిమాలు చేసుకుంటూ బిజెపి, టిడిపి కి మద్దతుగా రాజకీయాల్లోకి దిగాడు. కానీ 2019 ఎన్నికలకు మాత్రం సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి కేవలం [more]
పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో సినిమాలు చేసుకుంటూ బిజెపి, టిడిపి కి మద్దతుగా రాజకీయాల్లోకి దిగాడు. కానీ 2019 ఎన్నికలకు మాత్రం సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ జనసేన, టిడిపి కూడా వైసిపి ఫ్యాన్ గాలిలో ఎలా కొట్టుకుపోయాయి మన చూశాం. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఒక్క సీటుతో సరిపెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలనే నమ్ముకోనున్నాడనే ప్రచారం మొదలైంది. ఎలాగూ 2024 ఎన్నికల వరకు ఎంత కొట్టుకున్నా రాజకీయాలతో ఒరిగేది లేదు. కాబట్టి సినిమాలు చేసుకుంటేనే బెటర్ అంటూ సన్నిహితులు పవన్ కి సలహాలిస్తున్నారట.
అడ్వాన్స్ లు తీసుకోవడంతో…..
అయితే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కొంతమంది నిర్మాతల దగ్గర 2019 ఎన్నికలకు ముందు….. అంటే పవన్ సినిమాలు వదిలేసి రాజకీయాలకే పరితమైనప్పుడు కొన్ని అడ్వాన్స్ లు తీసుకున్నాడు. అయితే ఆ అడ్వాన్స్ ల మాట ఎలా ఉన్నా… తాజాగా పవన్ కళ్యాణ్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రం చెయ్యడానికి కమెడియన్ కం నిర్మాత కం రాజకీయనాయకుడు అండ్ పవన్ కి పరమ భక్తుడు అయిన బండ్ల గణేష్ సన్నాహాలు మొదలెట్టినట్లుగా టాక్. ఆల్రెడీ పవన్ తో బండ్ల గణేష్ సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక పవన్ ని హీరోగా పెట్టి బోయపాటి ని దర్శకుడిగా సెట్ చేసి బండ్ల సినిమాని నిర్మించడానికి ట్రై చేస్తున్నాడట. అలాగే పవన్ కి పారితోషికంగా 40 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా సమాచారం.
బండ్ల గణేష్ నిర్మాతగా…..
మరి పవన్ కళ్యాణ్ తో బండ్ల సినిమా అంటే విచిత్రం లేదుకానీ.. బోయపాటి తో పవన్ సినిమా అంటే కాస్త విచిత్రమే. ఎందుకంటే బోయపాటి తన హీరోలను ఊర మాస్ మాదిరి చూపిస్తాడు. మరి రాజకీయాల్లో బఫూన్ గా మిగిలిన పవన్ కళ్యాణ్ మాస్ అంటూ సినిమా మొదలెడితే పవన్ ఫాన్స్ ఏమో కానీ.. మిగతా ప్రేక్షకులకు మాత్రం నవ్వొస్తుంది. ఇక పవన్ ఫాన్స్ ని నమ్మడానికి లేదు.. ఎందుకంటే పవన్ ని అతని ఫాన్స్ రాజకీయాల్లో ఎంతగా మోసం చేసారో అనేది పవన్ ఓటమే తెలియజేస్తుంది.