ఎన్నికలు పూర్తి… మెగా హీరోలు రిలాక్స్ మోడ్ లోకి

ఏపీలో నిన్న జరిగిన ఎన్నికలతో మెగా హీరోలంతా ఊపిరి పీల్చుకున్నారు. మెగా హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్లడం, నాగబాబు జనసేన తరుపున ఎంపీగా [more]

Update: 2019-04-12 06:53 GMT

ఏపీలో నిన్న జరిగిన ఎన్నికలతో మెగా హీరోలంతా ఊపిరి పీల్చుకున్నారు. మెగా హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్లడం, నాగబాబు జనసేన తరుపున ఎంపీగా నరసాపురం నుండి పోటీ చెయ్యడంతో.. మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కి మద్దతుగా జనసేన ప్రచారంపై వెళ్లడం, అలాగే వరుణ్ తేజ్, నిహారికలు తండ్రి నాగబాబు కి మద్దతుగా ర్యాలీ చేయడం, బాబాయ్ పవన్ తో వరుణ్ తేజ్ కూడా ప్రచారం చెయ్యడం.. ఇలా అంతా ఎన్నికల హడావిడి తో అలసిపోయి ఉన్నారు. అయితే తాజాగా ఎన్నికలు పూర్తికావడంతో.. పవన్ తో పాటుగా మిగతా వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇక ఎన్నికలతో అలిసిపోయిన మెగా హీరోలంతా రిలాక్స్ మోడ్ లో కి వెళుతుంటే… మెగా మేనల్లుడు సాయి ధరమ్ మాత్రం తన తాజా సినిమా చిత్రలహరి టెంక్షన్ లో ఉన్నాడు. ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రలహరికి యావరేజ్ టాక్ పడింది. అయితే తన చిత్రలహరి సినిమాని మెగా హీరోలంతా కలిసి కూర్చుని వీక్షించేలా సాయి ధరమ్ చిత్రలహరి స్పెషల్ షోకి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. మెగా హీరోలంతా కలిసి ఒకే చోట చిత్రలహరి సినిమా ని చూసేందుకు చిత్రలహరికి స్పెషల్ షో చూపించే ప్లాన్ లో సాయి ధరమ్ ఉండడంతో.. ఎలాగూ కాస్త రిలీఫ్ కోరుకుంటున్న మెగా హీరోలంతా కూడా ఈ స్పెషల్ షోకి హారవుతారని అంటున్నారు

Tags:    

Similar News